దళంలో వసంత కీలక నేత


ఆమెపై రూ.4 లక్షల రివార్డు, 51 కేసులు

ఆమెతో పాటు ముగ్గురు మిలీషియా సభ్యుల అరెస్టు

మీడియా ముందు   {పవేశపెట్టిన ఎస్పీ


 


సీతమ్మధార(విశాఖ) : జిల్లా పోలీస్ అధికారులు అరెస్టు చేసిన మావోయిస్టు  సభ్యురాలు వంతల వసంత దళంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆమెపై మొత్తం 51 కేసులు నమోదయ్యాయి. ఆమెపై రూ. 4 లక్షల రివార్డు ఉంది. ఆమెతో పాటు   జీకేవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన  పొంగి సత్తిబాబు, పొంగి కామేశ్వరరావు, గెమ్మిలి గోవిందరావు అనే ముగ్గురు మిలీషియా సభ్యులను ఆదివారం అరెస్టు చేసి సోమవారం మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.  వలసగెడ ్డ గ్రామం, జీకేవీధి మండలం  వలసగెడ ్డ గ్రామానికి చెందిన వంతల వసంత (ఎలియాస్ జ్యోతి)పై రూ.4 లక్షల ప్రభుత్వ రివార్డు ఉంది. 2004 నుంచి 2008 వరకు దళసభ్యురాలిగా పనిచేసింది. ఆమెపై మొత్తం 51 కేసులు ఉండగా వాటిలో ప్రధానంగా 15 హత్య కేసులు ఉన్నాయి. వ్యక్తులను తీవ్రంగా కొట్టడం, గాయపరచడం, చంపుతామని బెదిరించడం వంటి కేసులు ఉన్నయి.  





2007లో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి పీఎస్ పరిధిలో లంక అనే గిరిజనుడి హత్య , 2010లో జీ.కె.వీధి మండలానికి చెందిన గిరిజనుడు సాగిన సోమలింగం, 2014లో చింతపల్లి మండలం బలపం పంచాయతీ మాజీ సర్పంచ్ సీంద్రి కార్ల, 2015లో ఆండ్రపల్లి పంచాయతీకి చెందిన సహదేవ్ , 2015లో ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజనుడు గోపాలరావు, 2016లో జర్రెల మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణ హత్య సంఘటనల్లో ఈమె పాల్గొంది.   2004 నుంచి 2014 వరకు  వివిధ ఆస్తుల ధ్వంసం, ఎదురుకాల్పుల సంఘటనల్లో పాల్గొంది. అలాగే పొంగి సత్తిబాబు, (ఎలియాస్ గొర్లెమెట్ట సత్తిబాబు) గాలికొండ దళం అన్నవరం పాకెట్‌లో మిలీషియా డిప్యూటీ కమాండర్‌గా పనిచేసేవాడు.  కల్వర్టు బ్లాస్టింగ్, సర్పంచ్ ఇంటిపై దాడి, దేవరపల్లి మాజీ జెడ్‌పీటీసీ మెంబర్ ఇంటిపై దాడి తదితర కేసుల్లో ఉన్నాడు. పొంగి కామేశ్వరరావు గాలికొండ ఆర్మడ్ మిలీషియా సభ్యుడిగా పనిచేశాడు.  గిరిజనులను మావోయిస్టు సమావేశాలకు తీసుకువెళ్లడం, సమాచారం చేరవేయడం వంటి పనులు చేసేవాడు.   గెమ్మిలి గోవిందరావు  గాలికొండ ఏరియా గొణుకురాయికి చెందినవాడు. ఆర్మడ్ మిలీషియా సభ్యుడిగా పనిచేసేవాడు. 2016లో జెర్రిల మాజీ సర్పంచ్ సాగిల వెంకటరమణ హత్యతో పాటు వివిధ సంఘటనల్లో పాల్గొన్నాడు.  ఈ ముగ్గురిపై రూ. లక్ష వంతున రివార్డు ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top