ఏజెన్సీ ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యాచరణ


 సాంబమూర్తినగర్ (కాకినాడ) : గిరిజనులకు ఆరోగ్య సేవలపై కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గిరిపుత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడం, వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవడం కోసం ఆయా ప్రాంతాల్లోని నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు ప్రత్యేకాధికారుల ను నియమించారు. ఏజెన్సీ, విలీన మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పది మంది ప్రోగ్రాం అధికారులకు ప్రత్యేకాధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వు ల్లో కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని కేంద్రాలను వారంలో ఒక రోజు తనిఖీ చేయాలన్నారు.



జాతీ య పథకాలన్నింటినీ పర్యవేక్షించాలని ఆదేశించారు. టీబీ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, ఎన్‌హెచ్‌ఎం నిధుల వినియోగం, మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టం, జేఎస్‌వై, జేఎస్‌ఎస్‌కే, శిక్షణ కార్యక్రమాలు, ఆర్‌బీఎస్‌కే వంటి వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రత్యేకాధికారులపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.   గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ఆశిస్తోం దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమాలను హాబిటేషన్లలో నిర్వహించే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి (ప్రతి నెలా 2, 4 మంగళవారాల్లో) తాను ప్రత్యేకాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపా రు. ఇందుకు సంబంధించిన సౌకర్యాలు, వసతులను ప్రత్యేకాధికారులకు కల్పించాల్సిందిగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం. సావిత్రమ్మను ఆయన ఆదేశించారు. సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల వారీగా నియమితులైన ప్రత్యేకాధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

 

 ప్రత్యేకాధికారి పేరు              హోదా              కేటాయించిన సీహెచ్‌సీ, పీహెచ్‌సీ

 డాక్టర్ సులోచన    డీసీహెచ్‌ఎస్, రాజమండ్రి    గంగవరం, పిడతమామిడి, ఎల్లవరం

 డాక్టర్ పవన్ కుమార్    ఏడీఎంహెచ్‌ఓ(ఎయిడ్స్,లెప్రసీ)    మారేడుమిల్లి, బొందులూరు, గుర్తేడు

 డాక్టర్ ప్రసన్నకుమార్    ఏడీఎంహెచ్‌ఓ(టీబీ)    పి. గెద్దాడ, దేవీపట్నం, కొండమొదలు

 డాక్టర్ ప్రసన్నాంజనేయులు    ఎన్టీఆర్ ఆరోగ్య సేవ    జీడికుప్ప, కుతూరు

 డాక్టర్ మల్లికార్జున్    ఎన్‌హెచ్‌ఎం    గౌరీదేవిపేట, నెల్లిపాక, లక్ష్మీపురం

 డాక్టర్ సత్యనారాయణ    పీఓ డీటీటీ    అడ్డతీగల, వై.రామవరం, చవిటిదిబ్బలు, దుప్పలపాలెం

 డాక్టర్ అనిత    డీఐఓ    నర్సాపురం, వాడపల్లి, ఇందుకూరుపేట

 ప్రసాదరాజు    డెమో    జడ్డంగి, లాగరాయి, రాజవొమ్మంగి

 ప్రసాద్    డీఎంఓ    మంగంపాడు, తులసిపాకల, ఏడుగురాళ్లపల్లి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top