త్వరలో పోస్టాఫీసుల్లోనూ రూ.300 టికెట్లు


  • పోస్టల్‌శాఖ అధికారులతో టీటీడీ సంప్రదింపులు

  •   మలివిడతలో పోస్టాఫీసుల ద్వారా టికెట్ల జారీ

  • సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనంలో కొత్తగా టీటీడీ ప్రారంభించిన రూ.300 ఆన్‌లైన్ టికెట్లు త్వరలో పోస్టాఫీసుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ ఆన్‌లైన్, టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల్లో మాత్రమే కేటాయించే టికెట్లను సులభ పద్ధతిలో భక్తులకు అందజేసేలా టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

     

    ఇంటర్నెట్ టికెట్లకు భలే గిరాకీ.. సగానికిపైగా అమ్ముడుపోని ఈ-దర్శన్    



    టీటీడీ గత గురువారం నుంచి రోజుకు 11వేల టికెట్లను ఈ కొత్త విధానంలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఇంటర్నెట్ ఆన్‌లైన్ పద్ధతిలో కోటా కింద ఆరు వేల టికెట్లు కేటాయించారు. మిగిలిన ఐదు వేల టికెట్లు టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల్లో కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

         

    ఇందులో ఒక రోజు, 7 రోజులు, 14 రోజుల ముందుగా టికెట్లు రిజర్వు చేసుకుని నిర్ణీత సమయంలో భక్తులకు దర్శనానికి వస్తున్నారు.

         

    వీటిలో ఇంటర్నెట్‌లో కేటాయించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోగా, టీటీడీ ఈ- దర్శన్  కేంద్రాల్లో టికెట్లు సగానికిపైగా టికెట్లు అమ్ముడు పోవడం లేదు. టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ పద్ధతిలో తమ ఫొటో, వేలిముద్రలు వేసి టికెట్లు తీసుకునేందుకు భక్తులు మొగ్గుచూపకపోవడం వల్లే టికెట్లు సగానికిపైగా అమ్ముడు పోవడం లేదు. ఇలా రోజువారీగా అమ్ముడు పోని టికెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ కింద భక్తులను సర్దుబాటు చేస్తున్నారు.

     

    మలివిడతలో పోస్టాఫీసుల ద్వారా టికెట్ల జారీ



    మొత్తం 18 వేల టికెట్లను ఆన్‌లైన్ పద్ధతిలో భక్తులకు కేటాయించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఇంటర్నెట్,  ఈ-దర్శన్‌కేంద్రాల్లో మొత్తం 11వేల టికెట్లను కేటాయిస్తోంది.

         

    ఇక మిగిలిన 7వేల టికెట్ల కోటాలో ఎక్కువ భాగాన్ని  రాష్ట్రంలోని పోస్టాఫీసుల ద్వారా టికెట్లు విక్రరుుస్తే భక్తులకు చాలా అందుబాటులో ఉం టుందని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భావిస్తున్నారు.

         

    ఇందులో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోస్టల్ విభాగం ఉన్నతాధికారులతో ఈవో, జేఈవో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

         

    అది అమల్లోకి వస్తే పోస్టాఫీసుల్లో ఇంటర్నెట్ ఆన్‌లైన్‌తోపాటు ఈ-దర్శన్ పద్ధతిలో కూడా భక్తులు చాలా సులువుగా టికెట్లు పొందే అవకాశం కలుగుతుంది.  

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top