ఏసీబీ వలలో సోషల్ వెల్ఫేర్ డీడీ

ఏసీబీ వలలో సోషల్ వెల్ఫేర్ డీడీ - Sakshi


గుంటూరులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన హనువుంతునాయుక్  

తెలంగాణవాసి అయినందునే దాడి చేరుుంచారని టీఎస్ ఉద్యోగ సంఘాల ఆరోపణ


 

గుంటూరు/హైదరాబాద్ : నర్సింగ్ విద్యార్థినుల స్కాలర్‌షిప్‌ల పెండింగ్ ఫైల్ క్లియరెన్‌‌స కోసం రూ.లక్ష డిమాండ్ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. కళాశాల చైర్మన్ నుంచి సోమవారం రాత్రి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గుంటూరు లక్ష్మీపురంలోని ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రాజారావు వెల్లడించారు. గుంటూరు నగరానికి చెందిన పుల్లగూర ఇమానియేల్ ప్రకాష్ ఫిరంగిపురంలో నర్సింగ్ కళాశాల నడుపుతున్నాడు. ఈ కళాశాల విద్యార్థినులకు 2012-13 సంవత్సరానికిగాను స్కాలర్‌షిప్‌లు రావాల్సి ఉంది. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేందుకు, పెండింగ్ ఫైల్‌ను కమిషన్ కార్యాలయానికి పంపేందుకు గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి.హనుమంతు నాయక్ బాధితుల దగ్గర రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ నెల 13న  ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు అదేరోజు గుంటూరు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం సోమవారం రాత్రి డీడీ ఇంట్లో బాధితుడు లంచం ఇస్తుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. డీడీ హనుమంతు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో డీడీ చేతిగోరు అతనికే తగలడంతో కంటికి స్వల్ప గాయమైంది. డీడీపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు.  



కాగా ఈ దాడి అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య వివాదంగా మారింది. రిలీవ్ అయ్యేందుకు వెళ్లిన హనువుంతు నాయుక్‌పై సోమవారం రాత్రి ఏసీబీ దాడులు చేయడం కక్ష పూరితమేనని తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. విషయూన్ని గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు భద్రత లేదనే విషయం తేలిపోయిందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఇలాంటి కక్ష పూరిత దాడులు కొనసాగితే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను పని చేయనీయబోమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల విభజనను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ స్పష్టం చేశారు.



చర్యలు తీసుకుంటామని సీఎం హామీ..



తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్‌ను గుంటూరు ఏసీబీ అధికారులు దాడి చేసి అరెస్టు చేయడాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు వెంటనే చేపట్టాలని మంగళవారం రాత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎస్‌తో మాట్లాడి తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు జారీ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

 

అన్యాయుంగా ఇరికించారు: కోదండరామ్

 

హనువుంతును అన్యాయంగా ఏసీబీ కేసులో ఇరికించారని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఏసీబీ కేసులో నిందితుడైన హనుమంతు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని బేషరతుగా కేసు నుంచి విముక్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పలువురు టీజేఏసీ నాయకులతో కలసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్-17ను తెలంగాణ ప్రజలు విలీన దినాన్ని పార్టీలకు, కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top