సింగపూర్ సేవలు ‘ఉచితం’ కాదు!


సాక్షి, హైదరాబాద్: సింగపూర్ దేశం మనకు(ఏపీకి) ఉచితంగా సేవలందిస్తుందంటూ సీఎం చంద్రబాబు ఇంతకాలం ఊదరగొట్టిన మాటల్లో నిజం నేతిబీరేనని తేలిపోయింది. సింగపూర్‌కు చెందిన సంస్థలు అందిస్తున్న ప్రతి సేవకూ ‘ఇంతని’ లెక్కగట్టి బాబు సర్కారు చెల్లింపులు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఘన వ్యర్థాల నిర్వహణకు అందించిన సేవలకుగాను ఏకంగా రూ.1.05 కోట్లను చెల్లించింది.


ఆ సేవలు ఏ రూపంలో ఎప్పుడు అందజేశారో గానీ.. సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్‌ప్రైజెస్(ఎస్‌సీఈ), సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్(సీఎల్‌సీ)లకు ఆ మొత్తం చెల్లించేలా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సేవలపై 1.5 లక్షల అమెరికన్ డాలర్లు, దానిపై పన్నులు కలిపి చెల్లించాలని(మొత్తం 1.05 కోట్లు) ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైగా ఈ సొమ్మును 2 రోజుల కిందట ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి చెల్లించాలని ఆదేశించడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top