రొయ్యల సీడ్ ఎంపికే ప్రధానం


  • ఆక్వా అసిస్టెంట్ డెరైక్టర్ ఖాన్‌దాన్

  • కోడూరు : ఆక్వా సాగు చేసే రైతులు సీడ్‌ను ఎంచుకునే విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తేనే ఫలితం ఉంటుందని ఎంపెడా సంస్థ ఆక్వా అసిస్టెంట్ డెరైక్టర్ ఎస్.ఖాన్‌దాన్ అన్నారు. శుక్రవారం  శ్రీదానాశక్తి ఆర్యవైశ్య ప్రార్థనామందిరంలో భారత వాణిజ్య, పరిశ్రమల మం త్రిత్వ శాఖలకు చెందిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టైగర్ రొయ్యల సాగు పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.



    ముఖ్యఅతిథిగా వచ్చిన ఖాన్‌దాన్ మాట్లాడుతూ ఆక్వా రంగంపై ప్రసుత్తం వెనామీ జాతికి చెందిన రొయ్యలపై రైతులు మక్కువ చూపుతున్నారని, కానీ టైగర్ రొయ్య సాగుచేయడం వల్ల మంచి లభాలతో పాటు ప్రజలకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.  

     

    రొయ్యల పెంపకంపై సెమినార్..



    రొయ్యలను చెరువులో వేసిన దగ్గర నుంచి పట్టే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఎంపెడా యాంటిబయాటిక్స్ అసిస్టెంట్ డెరైక్టర్ వి.సుబ్బారావు సెమినార్ ద్వారా రైతులకు వివరించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎస్.వి.శర్మ ,కాకినాడకు చెందిన నాస్‌ఖా సీఈవో జి.రాజ్‌కుమార్,  ఎంపెడా ఏఐ షణ్ముకరావు, ఆక్వా జేటీవో పి.శ్రీనివాసులు, ఆక్వా టైగర్ హెల్త్ అధికారి జి.రామార్ మాట్లాడారు.



    కోడూరు, నాగాయలంకకు చెందిన ఆక్వా రైతులు వంసతరావు సుధాకర్‌రావు, పేర్ల శేషగిరిరావు, సైకం భాస్కరరావు, తదితరులు ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రొయ్యల సాగు చేస్తున్న రైతులకు లెసైన్సులను ఉచి తంగా అందజేశారు. భావదేవరపల్లికి చెందిన మండలి వెంకటకృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు, రైతు సంఘం నాయకులు ఆవుల బసవయ్య పాల్గొన్నారు.



    టైగర్ రొయ్యతో లాభాల పంట

     

    తగిన జాగ్రత్తలతో  సాగుచేస్తే ఆక్వా రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న టైగర్ రొయ్య రైతులకు లాభాల పంట తెచ్చిపెడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ  రిటైర్డ్ ప్రోఫెసర్ ఎస్.వి.శర్మ అన్నారు. టైగర్ రొయ్య పెంపకంపై కోడూరులో రైతులకు ఏర్పాటు చేసిన సదస్సుకు హజరైన శర్మ పలు సూచనలు అందించారు. యాంటిబయాటిక్స్‌ని నిబద్ధత లేకుండా వాడటాన్ని తగ్గిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన రొయ్యలను అందించగలుగుతారని ఆయన తెలిపారు. రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.  

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top