అదృశ్యమై..నటుడయ్యాడు

అదృశ్యమై..నటుడయ్యాడు - Sakshi

 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:వ్యక్తి అదృశ్యం..ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..తన కొడుకు తప్పి పోయాడని తండ్రి ఆవేదన...అదే కొడుకు ప్రయోజకుడిగా మారాడని తెలిస్తే.. తిరిగి ఇంటికి వస్తే.. కన్నవారి కళ్లల్లో ఆనందం చెప్పలేనిది. అదే జరిగింది శేషు శంకర్ ( షకలక శంకర్) విషయంలో. పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈయన నేడు మంచి కమేడియన్‌గా చిత్ర పరిశ్రమలో గుర్తిం పు తెచ్చుకున్నాడు. ఒక టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న జబర్‌దస్త్ కార్య క్రమంలో 50 ఎపిసోడుల్లో నటించి తనలోని కళా ప్రతిభను ప్రదర్శిస్తున్న ఈయన సంక్రాంతి సందర్భంగా స్వగ్రా మమైన ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస గ్రామ పరిధిలోని శేసు పేట లో బుధవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.

 

 10వ తరగతి తప్పి..

 పదో తరగతి పరీక్షలో తప్పడంతో శంకర్ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి రాములు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో తన కుమారుడు అదృశ్యమయ్యాడని 2000 సంవత్సరం లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈయన హైద రాబాద్ చేరుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారి సహకారంతో తొలుత పెయింటర్‌గా జీవితం ప్రారంభించారు. సిక్కోలు జిల్లా మండ లికం, యాస, తూర్పు రామాయణం జానపదం వంటి అంశాల్లో పట్టు ఉండడంతో సినీ రంగంలో చేరాలని భావించాడు. పెయింటర్‌గా పనిచేస్తూనే మరో పక్క సినిమాల్లో ప్రయత్నాలు ప్రారం భించాడు. కొత్త నటీనటులు కావాలని పత్రికల్లో వచ్చే ప్రకటనలు చూసి అక్కడ వాలిపోయేవాడు. అయితే చిత్ర పరిశ్రమలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి అవకాశాలు ఆంత సులభం కాదు. అందులోనూ కు గ్రామం నుంచి వచ్చిన ఇతనికి కూడా అంతతేలిగ్గా అవకాశాలు లభించలేదు. 

 

 అయితే పట్టువదలని విక్రమార్కుడిలా శంకర్ ప్రయత్నాలు చేస్తుండగా 2007లో చంద్ అనే డెరైక్టర్ నూతన నటీనటులతో ‘నోట్ బుక్’ సినిమా తీశారు. ఈ సినిమాలో నటించేందుకు శంకర్‌కు అవకాశం వచ్చింది. ఆ తరువాత  మళ్లీ అవకాశాలు రాలేదు. దీంతో అధైర్య పడకుండా మళ్లీ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కొన్ని చిన్న సినిమాల్లో నటించినా అవి రిలేజ్‌కు సైతం నోచు కోలేదు. ఇంతలో ఓ చానెల్‌లో వస్తున్న జబర్‌దస్త్ కార్యక్రమానికి ఎంపిక వ్వడంతో ఇతని జాతకం మారి పోయింది. ప్రముఖ నటుడు నాగ బాబు, నటి రోజా వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ కార్య క్రమం శంకర్‌లోని కమేడియన్‌ను పూర్తిస్థాయిలో వెతికితీసింది. దీంతో పాటు మరో 50 భాగాలు చేసేందుకు శంకర్ ఆ చానెల్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

 

 ఈ కార్యక్రమం ప్రాచుర్యం పొందటంతో సినిమా అవ కాశాలు కూడా వస్తున్నాయి. మోహన్ బాబు హీరోగా రామ్‌గోపాల్ వర్మ డెరైక్టు చేస్తున్న సినిమాలో అవకాశం లభించింది. మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంతో రూపు దిద్దు కుంటున్న ఆగడు, ఈరోజుల్లో దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపు దిద్దు కొంటున్న చిత్రంలో పాటు మరో 10 చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినట్టు శంకర్ ‘న్యూస్‌లైన్’కు చెప్పా రు. పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఉందని మనసులోని మాట చెప్పుకొచ్చారు.  

 

 ఘన సన్మానం

 శంకర్‌కు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తనవం తు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో  స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి శ్రీనివాసరావు, సర్పంచి అంబటి సుజాత, నానాజీ పాల్గొన్నారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top