కెనాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
భీమడోలు : ఓ ప్రయివేటు స్కూల్ బస్సు అదుపు తప్పి కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంకలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే కెనాల్లో నీళ్లు లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ...బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను రక్షించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 50మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పెను ప్రమాదం తప్పటంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.