శబరి దళ సభ్యుడు అరెస్ట్


ఎడపాక: తూర్పుగోదావరి జిల్లా ఎడపాక మండలం గొల్లగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఓ దళ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. శబరి ఏరియా కమిటీలో దళ సభ్యుడిగా పని చేస్తున్న ముచ్చిక అడమయ్య(21) అనే యువకుడు అడవిలో సంచరిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇతను గతంలో జరిగిన పలు కిడ్నాప్‌లతో పాటు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ విలేకరులకు తెలిపారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top