ఘోరం జరిగిన వేళ స్పందించే తీరు ఇదేనా?


 పిఠాపురం :‘ఇది కనీవినీ ఎరుగని ప్రమాదం. ఇంత దారుణం జరిగితే ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరం. మీకోసం సర్కారుపై పోరాడుతా’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాకతిప్ప విస్ఫోట బాధితులకు ధైర్యం చెప్పారు. బుధవారం ఆయన కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాకినాడ నుంచి పండూరు మీదుగా  పెదకలవల దొడ్డి వచ్చిన ఆయన ఆ గ్రామానికి చెందిన మృతుడు పిల్లి వీర మణికంఠస్వామి తల్లి కామేశ్వరి, తండ్రి సత్తిబాబు, మరో మృతుడు దమ్ము గుర్రయ్య భార్య మంగ, కుమార్తెలు విమలాదేవి, ప్రమీలలను ఓదార్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుక్కల శ్రీను భార్య రమణమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

 అనంతరం నిదానందొడ్డి వెళ్లి మృతులు తుట్టా మంగ, ఆమె కుమారుడు సత్తిబాబుల కుటుంబ సభ్యులైన చంద్రరావు, నూకరత్నం, చినతల్లిలను ఊరడించారు.  రాయుడు రాఘవ, మేడిశెట్టి నూకరత్నం, తుట్టా నాగమణి కుటుంబసభ్యులను పరామరిచారు. జగన్‌ను చూడగానే బాధితులు బావురుమన్నారు. వారి దుఃఖాన్ని చూసి చలించిన ఆయన వారిని అక్కున చేర్చుకుని, అనునయించారు.  ‘అందరికీ అండగా ఉంటా. ఎవరు అధైర్యపడొద్దు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాను’ అని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిరుపేదలకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని జగన్ వ్యాఖ్యానించారు.

 

 దుర్ఘటన స్థలంలో చలించిన జగన్

 అనంతరం కొత్తపల్లి మీదుగా వాకతిప్ప చేరుకున్న ఆయన విస్ఫోటం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితి, కాలిపోయిన చెట్లు, వరిపొలం చూసి చలించిపోయారు. ‘ప్రమాదం కనీవినీ ఎరుగనిది. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదు’ అని ఆవేదనగా అన్నా రు.  అక్కడి నుంచి వాకతిప్ప ఎస్సీ పేటకు చేరుకున్న జగన్ ప్రమాదంలో మృతి చెందిన మసకపల్లి గంగ, మసకపల్లి అప్పయ్యమ్మ, మసకపల్లి విజయకుమారి, మసకపల్లి కుమారి, ద్రాక్షారపు కాంతం, ద్రాక్షారపు చినతల్లి, అద్దంకి నూకరత్నం, మసకపల్లి పుష్ప, ఉలంపర్తి కామరాజు, ఉండ్రాజపు కీర్తిల  కుటుంబసభ్యులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఆదుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. బాధితులకు అండగా ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. జగన్ వెంట ప్రత్తిపాడు, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు,

 

 మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కంపూడి రాజా, రాజమండ్రి కార్పొరేషన్‌లో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, వివిద నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, చెల్లుబోయిన వేణు, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావు నాయుడు, ఆకుల వీర్రాజు, అనుబంధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ యనమదల మురళీ కృష్ణ, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, కాకినాడ నగర కన్వీనర్ ఫ్రూటీ కుమార్, నాయకులు గంపల వెంకటరమణ, పట్టాభిరామయ్య చౌదరి, వట్టికూటి రాజశేఖర్, అల్లి రాజు, నక్కా రాజబాబు, ఆదిరెడ్డి వాసు, చెల్లుబోయిన శ్రీనివాస్,  సబ్బెళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి జమీలు, తాడి విజయ భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top