రుణమాఫీపై మాట నిలబెట్టుకోవాలి

రుణమాఫీపై మాట నిలబెట్టుకోవాలి


 బద్వేలు అర్బన్ :

 రుణమాఫీ అమలు చేసి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని బీజేపీ శాసనసభ పక్షనేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. గండికోట రిజర్వాయర్ పరిశీలనకు వెళ్తూ మార్గమధ్యంలోని బద్వేలు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం నూతన రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. వాటి నుంచి గట్టెక్కాలంటే కేంద్రం అధిక నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. టీడీ పీతో కలసి ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీ కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల వెంకటేశ్వర్లు, బీజేవైఎం రాష్ట్రకార్యవర్గ సభ్యులు సుబ్బరాజు, మున్సిపల్ చైర్మన్ సోమేసుల పార్థసారథి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రామకోటి రాజు పాల్గొన్నారు.

 గండికోటలో బీజేపీ బృందం

 కొండాపురం : జిల్లాలోని గండికోట ప్రాజెక్ట్‌ను బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం సందర్శించింది. ఆ పార్టీ విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి, నాయకులు సురేశ్‌రెడ్డి, శాంతారెడ్డి, కపిలేశ్వర్, జిల్లా అధ్యక్షుడు శశిభూషణం రెడ్డి తదితరులు ప్రాజెక్ట్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు. గండికోట ప్రాజెక్టులోని విశ్రాంతి భవన్ ఆవరణలో వారు ముంపు బాధితులు, కొండాపురం, ముద్దనూరు మండలాలకు చెందిన రైతులతో సమావేశమయ్యారు.  వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. దీంతో బత్తాయి తోటల ఎండిపోతున్నాయని జిల్లా అద్యక్షుడు వారి దృష్టికి తీసికెళ్లారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో శాసనసభ పక్షనేత విష్ణుకుముఆర్ ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే ఆయన ఎస్‌ఈ, డీఈలకు ఫోన్ చేసి మాట్లాడారు. గండికోట ప్రాజెక్ట్ నుంచి వామికొండ రిజర్వాయర్, పైడిపాళెం ప్రాజెక్ట్‌లోకి శ్రీశైలం నికర జలాలను మళ్లిస్తే తాగు, సాగునీటికి ఇ బ్బంది ఉండదన్నారు. తమకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని చౌటిపల్లె వాసు లు కోరారు.  తాళ్లప్రొద్దుటూరు సర్పంచ్ రామసుబ్బారెడ్డి, చామలూరు లక్ష్మిరెడ్డి, బీజేవైఎం విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.   

 ముద్దనూరులో...

 పార్టీలకతీతంగా సాగు,తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తె చ్చి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని బీజేపీ శాసనసభ పక్షనాయకుడు విష్ణుకుమార్‌రాజు తెలిపారు. ఆ పార్టీ నాయకులు శాంతారెడ్డి, కపిలేశ్వరయ్య, శశిభూషణ్‌రెడ్డితో కలసి ఆయన ముద్దనూరు మండలంలోని వామికొండ  రిజర్వాయర్‌ను ఆదివారం సందర్శించారు. తాగు, సాగు నీటి అవసరాల గురించి స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం శీతకన్ను పెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెనుకబడిన పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.  

 ఎర్రగుంట్లలో...

 రాయలసీమ థర్మల్(ఆర్టీపీపీ) ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల ప్రాజె క్ట్ పనులను బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమారురాజు ఆదివారం పరి శీలించారు. పనుల్లో జాప్యం జరుగుతోం దన్నారు. భూములు కోల్పోయిన కుటుం బాలకు ఉద్యోగాలు ఇచ్చే విషయం అ సెంబ్లీ సమావేశంలో చర్చిస్తానని హామీఇచ్చారు. ప్లాంట్ పనుల ఆలస్యంపై త్వ రలోనే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీపీపీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటసుబ్బారెడ్డి అన్నారు.  





 





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top