9 లక్షల ఖాతాల తిరస్కరణ


సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి, ఆధార్‌కు ముడిపెట్టిన ఏపీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల్లో ఆధార్ కార్డు ఉందని, ఏకంగా 9 లక్షల మంది  ఖాతాలను రుణ విముక్తి నుంచి తిరస్కరించింది. ఏపీలోనే పొలం ఉండి అక్కడ బ్యాంకుల్లోనే రుణం తీసుకున్నా ఆధార్ ఇతర రాష్ట్రాల్లో ఉండటంతో స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ 9 లక్షల ఖాతాలను రుణవిముక్తి అనర్హమైనవిగా తేల్చిం ది. ఇందులో 50 వేల ఖాతాదారులకు హైదరాబాద్‌లో ఆధార్ కార్డు ఉంది. ఏపీలోని వ్యవసాయ కుటుంబాలకు చెందిన వీరంతా వ్యాపారం లేదా ఇతర జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ కారణంగానే అక్కడ ఆధార్ కార్డు తీసుకున్నారు. ఏపీలోనే పొలం ఉండటంతో అక్కడి బ్యాంకుల్లోనే రుణాలు తీసుకున్నారు. వీరికి సర్కార్ మొండిచేయి చూపింది.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top