కళ్లల్లో కారం కొట్టి రూ.11 లక్షలు లూటీ


గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్ బ్యాంక్ అధికారి ఇంట్లో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. అధికారి రాంప్రసాద్ కళ్లల్లో కారం కొట్టి ఏటీఎంలో ఉంచేందుకు దాచిన రూ.11 లక్షలు దోచుకెళ్లారు. పల్సర్ బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. ఇల్లు అద్దెకు ఉందా అంటూ వారు తమింట్లోకి చొరబడ్డారని, లేదని చెప్పేలోపే తన కంట్లో కారం చల్లారని చెప్పాడు. తర్వాత ఇంట్లోకి చొరబడి డబ్బు ఎత్తుకుపోయారని వివరించాడు. వారిని పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వాపోయాడు.



అయితే కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న రాంప్రసాద్ వ్యహారశైలిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి మాటలకు పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సెక్యూరిటీ గార్డు, వ్యాన్ డ్రైవర్ బయటే ఉన్నప్పటికీ దొంగలను పట్టుకోలేకపోయారు. దొంగలు పారిపోయిన తర్వాతే రాంప్రసాద్ కేకలు పెట్టడంతో అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top