మృత్యుపంజా !


రామభద్రపురంః చెల్లెలి కూతురుకు పెళ్లి అవుతుందని సంబరపడి  వలస వెళ్లిన వారంతా సొంత ఊరికి చేరుకున్నారు.. రెండు రోజులుగా చుట్టాలు, బంధువులతో సంతోషాలను పంచుకున్నారు....పెళ్లికి వెళ్లి... నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో ఉండాలని నవ దంపతులను దీవించి ఇంటి ముఖం పట్టారు.  కొద్ది సేపట్లో గ్రామానికి చేరుతారనగా ముగ్గురు మహిళలను   మృత్యువు కాటేసింది.  మండలంలోని తారాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కు టుంబానికి  చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలవడంతో కొట్టక్కి గ్రామంలో విషాదం అలముకుంది.   ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్న వారు పెళ్లికి వచ్చి పరలోకాలకు వెళ్లిపోయారు.  మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన  కల్లూరి పైడితల్లి కుమార్తె వెంకటలక్ష్మి  వివాహానికి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నివాసముంటున్న  పైడితల్లి అక్కయ్య తవుడమ్మతో పాటు బంధువులంతా రెండు రోజుల కిందట వచ్చారు. కొట్టక్కి గ్రామం నుంచి బుధవారం రాత్రి వీరం తా ఆడపిల్ల వారి తరఫునబయలుదేరి... వివాహం జరిగిన బాడంగి మండలం రామచంద్రాపురం గ్రామానికి వెళ్లారు.

 

 అక్కడ వివాహం అంతా పూర్తయ్యాక కూతురు చుక్కల సింహాచలం (35) కోడలు గార కృష్ణవేణి(34)తో పాటు త వుడమ్మ, ఆమె భర్త కురమయ్య, మనుమలు, మనుమరా ళ్లు, బంధువులు కొట్టక్కి రావడానికి అదే గ్రామానికి చెందిన గార రాముకు చెందిన ఆటోలో  బయలుదేరారు. మరో పది నిమిషాల్లో గ్రామానికి చేరుతారనగా లారీని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించిన సాలూరు నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న వ్యాన్, ఆటోను  ఢీకొట్టింది. దీంతో  ఆ టో  రోడ్డు పక్కనున్న చెట్టుకు బలంగా ఢీకొ ఢీకొని నుజ్జునుజ్జయింది.   ఆటోలో ఉన్న  తవుడమ్మ, ఆమె కూతురు  సిం హాచలం  సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన  కృష్ణవేణి సాలూరు ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందింది.   గాయపడిన వారిలో ఆటో డ్రైవరు రాము, వ్యాన్ డ్రైవరు సుమన్‌లతో పాటు మృతురాలు తవుడమ్మ భర్త కురమయ్య, మనుమరాలు చుక్కల దీపిక, కూతురు శాంతి, మనుమడు తీల జగదీష్, మనుమరాలు గార దుర్గలున్నారు.

 

 క్షతగాత్రులను  స్థానిక పోలీసులు 108 పై సాలూరు ,బాడంగి ఆస్పత్రులకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం విజయనగరానికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. మృత్యవాత పడిన కుటుంబం గత 25 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా   ఏలూరుకి వలస  వెళ్లిపోయింది. కొట్టక్కి గ్రామంలో తవుడమ్మ  చెల్లెళ్లు  సీతమ్మ , పైడితల్లిలున్నారు. పైడితల్లి కూతు రు వెంకట లక్ష్మి పెళ్లి నిమిత్తం వారు కొట్టక్కి వచ్చారు. ప్ర మాదంలో మృతి చెందిన  సింహాచలంకు భర్త వెంకటరావు,   కొడుకు, కూతురు ఉన్నారు.  కృష్ణవేణికి భర్త వెంకటరావు,ఇద్దరు కొడుకులు ఉన్నారు.  పెళ్లికి వచ్చి మృత్యువాతకు గురి కావడంతో కొట్టక్కిలో విషాద ఛాయలు అలముకున్నాయి. తవుడమ్మ బం ధువుల ఇళ్లల్లో ఉన్న వారంతా కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాలకు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ సంతోష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

 క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి మృణాళిని

 విజయనగరం క్రైం : తారాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి మృణాళిని గురువారం పరామర్శించారు. వ్యాన్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. వీరిలో నలుగురిని పట్టణంలోని తిరుమల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి తిరుమల ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మె రుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అధినేత డాక్టర్ కె. తిరుమల ప్రసాద్‌కు  సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top