నారావారి నత్త సవారీ!

నారావారి నత్త సవారీ!

కుంటి సాకులు.. హామీలకు కోతలు

 ఇదీ నాలుగు నెలల పాలన తీరు

 

 చంద్రబాబు తొలి ఐదు సంతకాలు

  •  జూన్ 8వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 

  •  అనంతరం చేసిన తొలి అయిదు సంతకాలు..

  •  మొదటి సంతకం: రుణ మాఫీ విధివిధానాల కమిటీ ఏర్పాటు. ‘15 రోజుల్లో కమిటీ ఇచ్చే ప్రాథమిక నివేదికను అనుసరించి రైతులకు కొత్తగా రుణాల పంపిణీ చేయిస్తాం. 45 రోజుల తరువాత తుది నివేదిక రాగానే రైతులకు తగిన న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటన.

  •  రెండో సంతకం: వృద్ధులు, వితంతువుల నెలవారీ పింఛన్ రూ. 1,000కి, వికలాంగుల పింఛన్ 

  •  రూ. 1,500కు పెంపు. ఈ చెల్లింపులు గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి 

  •  అమల్లోకి వస్తాయని ప్రకటన.

  •  మూడో సంతకం: ప్రతి గ్రామానికీ మంచి నీరు అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం. 

  •  రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని ప్రకటన.

  •  నాలుగో సంతకం: రాష్ట్రంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు.

  •  అయిదో సంతకం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంపు.

 

 చంద్రబాబు హామీలు

 తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల చిట్టాలో ముఖ్యమైనవి..

 + అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై మొదటి సంతకం

 + రైతుల పంటల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి, పెట్టుబడి కే కాకుండా దిగుబడికీ బీమా

 + రూ.5 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్

 + పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి

 + హంద్రీ-నీవా, గాలేరు-నగరి, ఉత్తరాంధ్ర సు జల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి

 + వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్తు

 + గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తు

 + మద్యం బెల్టు షాపుల రద్దు

 + డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ. లక్ష రూపాయల వరకు వడ్డీ లేని కొత్త రుణం

 + పుట్టిన ఆడబిడ్డ పేరుతో ‘మహాల క్ష్మి పథకం’ కింద అర్హులైన కుటుంబాలకు రూ. 30 వేలు బ్యాంకులో డి పాజిట్

 + పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణిల ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ. 10 వే లు

 + అన్ని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థినులకు హాస్టళ్లు

 + ఇంటికో ఉద్యోగం, ఉపాధి. నిరుద్యోగ యువతకు రూ. వెయ్యి నుంచి 2 వేల వరకు భృతి

 + పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య

 + ఇంటర్మీడియట్ వరకు ఉచిత బస్‌పాస్.. కాలేజీ విద్యార్థులకు ట్యాబ్లెట్ కంప్యూటర్లు, ఐపాడ్‌లు

 + యువత స్వయం ఉపాధికి 3 శాతం వడ్డీతో రూ. 50 లక్షల వరకు రుణం

 + బీసీలకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్, 25 శాతం నిధులతో బీసీ ఉపప్రణాళిక

 + {పమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు

 + చేనేత కార్మికుల రుణాల మాఫీ. చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి. బడ్జెట్లో ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయింపు

 + వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 200 కోట్లు. వికలాంగులకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ. వికలాంగులకు రూ.1,500 పెన్షన్

 + ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటు కోసం హెల్త్‌కార్డులు. పెన్షనర్లకు ఉద్యోగులతోసమానంగా ఆరోగ్య ఖర్చులు

 + వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు పింఛన్

 + ఎన్టీఆర్ హెల్త్ కార్డుల పథకం ద్వారా ఏటా రూ. 2.5 లక్షల వరకు ముందుగా డబ్బు చెల్లించే అవసరం లేకుండా ఉచితంగా పరీక్షలు, చికిత్సలు

 + ఎన్టీర్ సుజల స్రవంతి కింద ప్రతి గ్రామానికి, ప ట్టణానికి రక్షిత నీటిసరఫరా. 

 

  •   ఎన్నికల హామీలన్నింటినీ అటకెక్కించిన చంద్రబాబు

  •   సాంకేతికంగా ముహూర్తం కోసం జూన్ 8న ప్రమాణం చేసినా...

  •   మే 16న ఫలితాలు వచ్చినప్పటి నుంచి పాలనా పగ్గాలు చేపట్టి

  •   4 నెలలుగా హడావుడి

  •   రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలకిచ్చిన హామీలన్నీ నీటిమూటలే

  •   మూలనపడ్డ రైతు, డ్వాక్రా రుణాల మాఫీ

  •   అన్నింటికీ రాజధానే పరిష్కారమన్నట్లుగా ‘షో’

  •   విపక్షంపై కొనసాగుతున్న హత్యాకాండ.. పట్టించుకోని సర్కారు

  •   అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా విపక్షంపై ఎదురుదాడి

 

 

 సాంకేతికంగా చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి వంద రోజులే అవుతున్నప్పటికీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించారు. మే 16న అ సెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అప్పటికి రా ష్ట్రం విడిపోలేదు. మే 22న చంద్రబాబు అప్పటి ఉమ్మ డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్, ప్రత్యేక కార్యదర్శి రామకష్ణరావులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చ ర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఆ మ రుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీగా రాముడు నియామకాలపై నిర్ణ యం తీసుకున్నారు. జూన్ 3న ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్‌రావును ఎంపిక చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే తన బాధ్యతలు నిర్వర్తించడం ఆరంభించారు.

 

 విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకొచ్చి నాలుగు నెలలైంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సర్కారు పనిచేస్తోంది. తొలి సంతకాలకే దిక్కు లేకుండా పోయింది. ఖరీఫ్ దాటిపోతున్నా.. రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఆకాశాన్ని అంటిన ధరలను తగ్గించే కనీస చర్యలు తీసుకోలేకపోయారు. ఎన్నికలకు ముం దు ఇచ్చిన హామీల అడ్రస్ లేకపోగా.. అమలులో ఉన్న పథకాలు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. ఎన్నికలకు ముందు ఆధార్‌తో లింకేమిటి అంటూ ఊరూవాడా ప్రశ్నించిన బాబు ఇప్పుడు అడుగడుక్కీ ఆధార్ ఉండాలంటూ తనదైన శైలిలో పాలనా సంస్కరణలకు తెరతీశారు. పథకాలకు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకు ఏమాత్రం పొంతనలేదు. ఏ వర్గానికీ న్యాయం చేయలే దు. ఆ దిశగా ఏ ప్రయత్నం లేకుండానే నాలుగు నెలలు నెట్టుకొచ్చారు. ప్రజలు అవస్థలు పడుతుంటే.. అన్నిం టికీ రాజధాని ఒక్కటే పరిష్కారమన్న రీతిలో ప్రజలను ఏమార్చుతున్నారు. కొత్త రాష్ట్రాన్ని సింగపూర్, మలేషి యా, చికాగోలా మార్చివేస్తామంటూ ప్రజల ముందు పంచరంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూనే.. మరోవైపు తన దగ్గర మంత్రదండమేమీ లేదని అంటున్నారు.

 

 మరోపక్క.. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా వ్య వహరిస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించడానికి వెనకడుగు వేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన శాసన సభ తొలి బడ్జెట్ సమావేశాల్లో ఏకైక ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కి ప్రజా సమస్యలపై చర్చలను దాటవేసింది. ప్రశ్నించే వారే ఉండొద్దని విపక్షంపై ఎదురుదాడికి దిగింది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సమయానికే 14 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ శాసన సభ దృష్టికి తెచ్చింది. అయినా అధికారపక్షంలో మార్పు లేదు. 

 

 దేశంలోనే అట్టహాసమైన ప్రమాణ స్వీకారం

 జూన్ 8న గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారీ ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా చంద్రబాబు సీఎంగా పదవీ స్వీకార ప్ర మాణం చేశారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో కలుపుకొని 19 మందితో కేబినెట్ కొలువుదీరింది. అత్యంత ఆర్బాటంగా సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో సహా ఆ పార్టీకి చెందిన జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, పలువురు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. దాదాపు 30 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమమైతే భారీగా చేశారే గానీ, ఆ తర్వాత హామీ ల ఆచరణలో మాత్రం అడుగులు తడబడ్డాయి.

 

 రుణ మాఫీపై దోబూచులాట

 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ ఉన్నాయి. అధికారంలోకి వస్తే తొలి సంతకంతోనే ఈ రుణాలన్నీ మాఫీ అయిపోతాయన్న హామీని అధికార పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. నాలుగు నెల లవుతున్నా ఇంతవరకు తొలి సంతకం ఫలితం రాలే దు. తొలి సంతకంతో మాఫీ కావలసిన ఈ రుణాలపై ప్రభుత్వం ఒక్కో దశలో ఒక్కో మెలిక పెడుతోంది. విధివిధానాల ఖరారు పేరుతో నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సీఎస్ రావు, ఆర్థిక నిపుణుడు చెరుకూరి కుటుం బరావులు సభ్యులుగా కమిటీని వేశారు. ఈ కమిటీ 45 రోజుల్లో తుది నివేదిక ఇస్తుందని, ఆ వెంటనే రుణ మాఫీ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కానీ కమిటీ ఏర్పాటై మూడు నెలలు దాటినా రుణ మాఫీపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత కొంతకాలం రీషెడ్యూలు పాటపాడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలున్నాయి. హామీ ఇచ్చే రోజునే ఈ విషయం తెలిసినప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఆనాడేమీ పరిమితుల గురించి చెప్పలేదు. అధికారంలోకి రాగానే ఆంక్షలు, షరతులు విధిస్తూ ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలా అన్న అంశం చుట్టూనే ప్రభుత్వం చక్కర్లు కొ డుతోంది. ఆధార్‌తో వ్యవసాయదారుడిని లింక్ చేయ డం, ఇంటికి ఒక్క రుణమే మాఫీ చేస్తామనడం, లక్షన్నరకంటే మాఫీ చేయబోమని, పంట రుణాలకే వర్తింపజేస్తామని, డిసెంబర్ 31 లోపు తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని ఇలా రోజుకో షరతు పెడుతోంది. 

 

 మహిళలకిచ్చిన హామీ పైనా ఇదే తీరు..

 డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చాక మాట మా ర్చినప్పటికీ, సూటిగా చెప్పింది ఈ విషయంలోనే. ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పటికీ అబ్బబ్బే.. అలాంటిదేమీ లేదని, ప్రతి సంఘానికి స్వావలంబన కోసం లక్ష రూపాయల నిధిని మాత్రం సమకూర్చుతామని చెప్పి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు.

 

 ఉద్యోగుల పీఆర్సీ మరిచిన సర్కారు

 అవశేషాంధ్రప్రదేశ్‌లో జూన్ నెలాఖరులో భారీ సంఖ్య లో ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సి ఉండగా వా రికి ఏకమొత్తం చెల్లింపుల తక్షణ భారం నుంచి బయట పడటానికని కొత్త ప్రభుత్వం వరాలు ఇచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి రోజే పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫారసులను అమలు చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. 2013 నుంచి పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే మిగిలిం ది. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో పదో షెడ్యూలులో చేర్చిన సంస్థల్లో(కార్పొరేషన్లు, ఎయిడెడ్ సిబ్బం ది) ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఏపీకి చెందిన ఆ సంస్థల్లోని ఉద్యోగులు కొందరు పదవీ విరమణ చేశారు.

 

 రాజధానిపై లోపించిన వ్యూహం ..!

 రాజధాని విషయంలోనూ సరైన వ్యూహంతో ముందుకెళ్లడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ప్రమా ణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే చంద్రబాబు విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు రాజధాని నగరం ఎంపికకు కేంద్రం శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ పరిశీలన కొనసాగిస్తున్న దశలోనే రాజధానిపై బాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రకటనలు చేస్తూ గందరగోళానికి తెరతీశారు. రాజధానిపై అందరినీ సంప్రదించడం లో, ఒప్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. పైగా తొలి నుంచీ చేస్తూ వచ్చిన ప్రకటనతో కృష్ణా, గుం టూరు జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంట డంతో రేపటి రోజున రాజధాని సామాన్యులకు మరింత భారంగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వ వైఖరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు కలిగేలా చేసింది. శివరామకృష్ణన్ కమిటీ లేవనెత్తిన సాంకేతిక అంశాలను కనీసం చర్చకు పెట్టడానికి కూడా ప్రభుత్వం సుముఖత చూపలేదు. పంతానికిపోయి ఏకపక్షంగా నిర్ణయానికి రావడంతో ఇప్పుడు అనుకున్న చోట ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించడం ఆ ప్రభుత్వానికే ఒక సవాలుగా మారే ప్రమాదం ఏర్పడిందన్న విమర్శలున్నాయి. సింగపూర్‌లో ఉన్నట్టు రెండు భారీ భవనాలు (ట్విన్ టవర్స్) నిర్మించి అదే రాజధాని అని చెప్పినంత సులభం కాదన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించడం విమర్శలకు తావిచ్చింది.

 

 కమిటీలు..! ఉపసంఘాలు..!

 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించని చంద్రబాబు.. ఈ నాలుగు నెలల్లో కమిటీల మీద కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘాలను నియమించడానికే మొగ్గుచూపారు. ఏ ఒక్క అంశంపైనా నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు. రుణమాఫీపై కోటయ్య కమిటీ, అవసరమైన వనరుల సమీకరణ కోసం ఎంపీ సుజనాచౌదరి నేతృత్వంలో మరో కమిటీ వేశారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ పనిచేస్తుండగానే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని నిర్మాణానికి సలహా కమిటీ వేశారు. రాజధానికి భూసేకరణకు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు తదితరులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. అవినీతిపై మంత్రులు యనమల, పల్లె రఘునాధరెడ్డి, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్‌లతో ఓ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో మరో ఉపసంఘం వేశారు. తమిళనాడు తరహాలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఇంకొక ఉపసంఘాన్ని నియమించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై పారిశ్రామికవేత్తలతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవేమీ ఇంతవరకు పూర్తిస్థాయిలో ఫలితాలనివ్వలేకపోయాయి.

 

 శ్వేతపత్రాలు...!

 చంద్రబాబు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, ప్రజలకిచ్చి హామీలను పక్కన పెట్టి అధికారం ఖాయమైన తొలి రోజు నుంచే గత ప్రభుత్వాలను నిందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టగా, అధికారం చేపట్టిన తర్వాతా అవే విషయాలను చెప్పడంలో అర్థం లేదు. దీన్ని మరించి, గత ప్రభుత్వ వైఫల్యాలం టూ అనేక శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, రేపటి రోజున వాటిని ప్రశ్నిస్తే విపక్షాలపై నెపం నెట్టివేయొచ్చ న్న రాజకీయ కారణాలతోనే బాబు వరుస క్రమంలో శ్వేతపత్రాలను విడుదల చేస్తూ వచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ నాలుగు నెలల్లో ఆయన వివిధ రంగాలపై ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశారు. ప్రతి శ్వేతపత్రంలోనూ గత పదేళ్ల కాంగ్రెస్‌పైన.. మరీ ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని లక్ష్యంగా చేసుకొని దుమ్మెత్తిపోయడంలోనే కాలాన్ని వెళ్లబుచ్చారు.

 

 ‘సాగుతూ’నే ఉన్న సంక్షేమ పథకాలు..

 అధికారాన్ని చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై బాబు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని పథకాలకు పేర్ల మార్పుతో సరిపెట్టా రు. బంగారు తల్లిని మా ఇంటి మహలక్ష్మిగా మార్చా రు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్థానంలో ఎన్టీఆర్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. విద్యార్థులకు అ త్యంతావశ్యకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నాలుగు నెలలైనా స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను అక్టోబర్ 2 నుంచి ఇస్తామని ప్రకటించింది. అయితే ఈలోగా ఒక్కో సంక్షేమ పథకంలో భారీగా కోతలు పెట్టే ప్రక్రియ మొదలెట్టింది. ఆధార్‌తో అనుసంధానం పేరుతో రేషన్ కార్డుల ఏరివేత, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌లో కోతలు పెట్టే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో వాటిలో కోతలు తప్పవని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.

 

 జవాబుదారీతనం కన్నా విపక్షం టార్గెట్‌గా!

 తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పలు రాజకీయ హత్యలు జరిగాయి. ప్రధానంగా ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు హత్యకు గురయ్యారు. రాజకీయ హత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులపై వల వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలను నయానా భయానా పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అసెంబ్లీలో ఏకైక విపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ గొంతు నొక్కారన్న విమర్శలు మూటకట్టుకుంది. శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన ఆగస్టు 18 నుంచి నిరవధికంగా వాయిదా పడిన సెప్టెంబర్ 6 వ తేదీ వరకు విపక్షంపై ఎదురుదాడికి దిగడం, దివంగత వైఎస్‌పై దుమ్మెత్తిపోయడం తప్ప మరో కార్యక్రమం లేదన్నట్లుగా కాలం వెళ్లదీసింది. హామీలను అమలు చేయలేదన్న విమర్శలకు జడిసి తెలుగుదేశం ప్రభుత్వం ఈరకమైన ప్రతిదాడికి దిగిందన్న విమర్శలను మూటకట్టుకుంది. పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. రాజధాని ప్రకటన విషయంలో, బీసీ తీర్మానం విషయంలో అసెంబ్లీలో అధికార పక్షం వ్యవహారం అత్యంత రహస్య ఎజెండాగానే నడిపించడం గమనార్హం.

 

 టీడీపీ హత్యారాజకీయాలు..

 ఎన్నికల ఫలితాల వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 15 మంది కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారి చేతిలో హత్యకు గురయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబులపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మే 16నఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పెద్ద మునయ్య (వినుకొండ, గుంటూరు జిల్లా), పెరవలి ప్రభాకరావు (వేమూరు, గుంటూరు జిల్లా), గోగాడి సింగయ్య (కనిగిరి, ప్రకాశం జిల్లా), నెర్ల దశయ్య (సీతానగరం, తూ.గో. జిల్లా), వేపూరి వెంకటేశ్వరరావు (గోకవరం, తూ.గో. జిల్లా), అలోకం కృష్ణారావు (గొట్టుముక్కల, కృష్ణా జిల్లా), రేపల్లె సురేష్ (అవనిగడ్డ, కృష్ణా జిల్లా), బురిడె సన్యాసిరావు (నెల్లిమర్ల, విజయనగరం జిల్లా), బలిజ బంగారు రెడ్డి (బేతంచెర్ల, కర్నూలు జిల్లా), సూర్య ప్రకాశం శెట్టి (శింగనమల, అనంతపురం), మర్రిబోయిన ఓబులేశు (చాపాడు, వైఎస్సార్ జిల్లా), బూసి చిన నాగిరెడ్డి, బూసి పెద్ద నాగిరెడ్డి (మేళ్లవాగు, గుంటూరు జిల్లా), మల్లిఖార్జున (ఎల్లుట్ల, అనంతపురం జిల్లా)లు టీడీపీ శ్రేణుల చేతు ల్లో హత్యకు గురయ్యారని వైఎస్సార్‌సీ ఆరోపించింది. నేతలు, కార్యకర్తలే కాదు ఎన్నికైన ప్రజాప్రతినిధుల పైనా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే రోజాపైనే దాడికి దిగారు. దేశమ్మ, ఓరుగుంటాలమ్మ గ్రామదేవతల ఊరేగింపు సందర్భంగా ప్రధాన హారతి విషయమై స్థానిక టీడీపీ నేత కుమరేశన్ మొదలియూర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా చేతిలోని హారతి పళ్లేన్ని టీడీపీ వర్గానికి చెందిన వారు లాక్కోవడంతో పాటు ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో రోజా చేతికి గాయమైంది. ఈ నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడుల్లో 119 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు గాయపడగా, పలువురు ఎమ్మెల్యేలతో పాటు స్థానికంగా ఉండే పార్టీ కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆ పార్టీ ఆరోపించింది. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top