తుపాను బాధితులకు అండగా నిలుద్దాం: సాక్షి మీడియా


  • సహృదయంతో స్పందించండి

  •   దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు

  •   ఆపన్నహస్తం అందించేందుకు విరాళాల సేకరణ

  •   సెక్షన్ 80జీ కింద ఆదాయ పన్ను మినహాయింపు

  •  

    బ్యాంకు ఖాతా వివరాలివీ..

     ఖాతా పేరు: వైఎస్సార్ ఫౌండేషన్

     ఖాతా సంఖ్య: 31868397566

     బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

     ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్0008022

     బ్రాంచి: బంజారాహిల్స్, ైెహ దరాబాద్

     బ్రాంచి కోడ్: 08022

     

     సాక్షి, హైదరాబాద్: కనీవినీ ఎరుగని రీతిలో హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సానికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తుపాను రూపంలో ప్రకృతి చూపిన ఆగ్రహానికి గంటల్లో అల్లకల్లోలం జరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు ఛిద్రమయ్యాయి. సర్వహంగులతో శరవేగంగా ఎదుగుతున్న విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. అనేక మంది నిండు ప్రాణాలతో పాటు వృత్తులు, వ్యాపారాలు, ఇళ్లు, రోడ్లు, చెట్లు, పంటలు.. ఇలా సర్వం కకావికలమైన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సాటి మనిషి ఆక్రందన చూసి ప్రతి తెలుగు హృదయం ద్రవిస్తోంది. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి సాంత్వన చేకూర్చాలి. 

     

    ఆపన్న హస్తంతో ఆదుకోవాలి. సహృదయంతో స్పందించాలి. అలా స్పందించే గుణం ప్రతి తెలుగువాడి సొంతం. గతంలోనూ విపత్తులు చోటుచేసుకున్నప్పుడు, బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి ‘వైఎస్సార్ ఫౌండేషన్’ సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. బాధితులకు అవసరమైన సేవలందించింది. ఎప్పటిలాగే వైఎస్సార్ ఫౌండేషన్ ఈ విపత్తులోనూ బాధితుల సహాయార్థం చొరవతో ముందుకు వచ్చింది. కష్టాల్లో ఉన్న పౌరుల్ని ఆదుకునే కృషిలో ఎప్పుడూ ముందుండే ‘సాక్షి మీడియా గ్రూప్’తో కలిసి ఈ సేవా కార్యక్రమానికి పూనుకుంది. లోగడ కూడా ఇటువంటి ప్రాకృతిక విపత్తులు సంభవించినపుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ కలిసి ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. 

     

    ఇప్పు డు హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకొచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారిని ఆదుకోవాల్సిందిగా వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్నవారు పక్క తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు (అకౌంట్ ట్రాన్స్‌ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కు లను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ అందించవచ్చు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top