అద్దె భవనాల్లో ఐటీఐ

అద్దె భవనాల్లో ఐటీఐ


- సొంత భవనాలు సమకూరేదెన్నటికో?

- 2013లో స్థలం కేటాయింపు

- 4.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన

కడప ఎడ్యుకేషన్:
  ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కళాశాల ఏర్పాటై 18 ఏళ్లయినా సొంత భవనాలు సమకూరలేదు. 1997 నుంచి 2001 వరకు ఆర్ట్స్ కళాశాల సమీపంలో అద్దె భవనాల్లో సాగించారు. ఆ తరువాత బాలాజీ నగర్‌లోని ఐటీఐ వద్ద గల డీఎల్‌టీ సీ ఐటీఐలోని భవనాల్లోకి తరలించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. అవి కూడా బాగా దెబ్బతిని అంత సౌకర్యంగా ఉండటం లేదని పలువురు విద్యార్థులు తెలిపారు.

 

2013లో స్థలం కేటాయింపు: ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కోసం 2013లో ప్రభుత్వం 4 ఎకరాల 97 సెంట్ల స్థ లాన్ని రిమ్స్ సమీపంలో కేటాయిం చిం ది. అందులో భవనాలను, కార్యాలయా న్ని నిర్మించేందుకు అప్పట్లో 4,60 కోట్ల తో ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు ఆ ఊసే లేదు. మళ్లీ ఏడాది క్రితం ఏపీడబ్లూ డీసీ వాళ్లకు మళ్లీ కూడా ప్రతిప్రాదనలు పంపారు. కానీ స్పందనమాత్రం లేదు.

 

సొంత నిధులు ఉన్నా: ప్రభుత్వ మైనార్టీ ఐటీఐకి దాదాపుగా రెండున్నర కోట్లు నిధులు ఉన్నట్లు తెలిసింది. సంబంధిత నిధులను కూడా కళాశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. కానీ దీనిని గురించి ప్రభుత్వమే పట్టింకకోకపొతే వారు కూడా మిన్నకుండి పోయినట్లు తెలిసింది.   

 

కోర్సుల వివరాలు: ప్రభుత్వ మైనార్టీ కళాశాలలో ఐదు రకాల కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రికల్, పిట్టర్, మోటర్‌మోకానిక్‌కు సంబంధించిన కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులకు రెండేళ్ల కాలపరిమితి ఉండగా డీజల్‌మోకానికల్, కంప్యూటర్ అపరేటర్‌కు మాత్రం ఏడాది మాత్రమే కోర్సుకు కాల పరిమితి. ఈ కళాశాలలో 136 మంది విద్యార్థులు చేరే సౌలభ్యం ఉంది. కానీ అప్పట్లో సమైకాంధ్ర ఉద్యమం వల్ల విద్యార్థులు అడ్మిషన్లు తక్కువగా జరిగినట్లు తెలిసింది.

 

ఈ ప్రభుత్వమైనా స్పందించాలి: మైనార్టీ ఐటీఐ భవనాల నిర్మాణం విషయంలో ఇప్పటి ప్రభుత్వమైనా స్పందిం చాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. స్థలం కేటాయించి కూడా ఏడాదినన్నర కాలం కావస్తుందన్నారు. సంబంధిత విషయంలో అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

 

ఉద్యోగావకాశాలు: ప్రస్తుతం టెక్నికల్‌కు సంబంధించి మం చి డిమాండ్ ఉంది. ప్రైవేటు కంపెనీల్లో ఐటీఐ అభ్యర్థులకు మంచి ఆదరణ ఉం ది. దీనికి తోడు కళాశాల వారే క్యాంపస్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలే బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ వారు క్యాంపస్ ఇంట ర్వ్యూను నిర్వహించి పలువురికి ఉద్యోగావకాశాలను కల్పించింది. కనుక ప్రతి ఒక్కరూ సంబంధిత విషయాన్ని గమనించి ఐటీఐలో చేరితే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top