ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజుల బాదుడు


ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టాంపు డ్యూటీని 4 నుంచి 5 శాతానికి పెంచారు. ఇంతకుముందు 2013లో జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ తాజాగా కొత్త ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.



రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతం నుంచి 1 శాతానికి పెంచారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై కూడా ఒక శాతం పీజు సవరణ జరిగింది. ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజును సవరించారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top