టీడీపీకి ఓటేయలేదని రేషన్ కార్డులు ఇవ్వరట..


శ్రీకాకుళం పాతబస్టాండ్ : మేమంతా టీడీపీకి ఓటేయలేదట.. అందుకే రేషన్‌కార్డుల మంజూరుకు cతెలపదట.. ఇదెక్కడి న్యాయం సారూ.. ఇదేనా ప్రజాస్వామ్యపాలన... ఇలా అయితే అధికారులు ఎందుకు.. ఎమ్మెల్యేలు ఎందుకు.. చట్టాల పనేమిటంటూ జి.సిగడాం మండలంలోని మెట్టవలస గ్రామస్తులు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 58 అర్హతగల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు మంజూరుకు సిఫార్సు చేయడం లేదని ఆరోపించారు.

 

 గ్రీవెన్స్‌సెల్‌లో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఏజేసీ పి.రజనీకాంతారావు, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో జె.వసంతరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ఎం.సునీల, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ అప్పలస్వామి తదితర అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.  శ్రీకాకుళం పట్టణంలోని మదురానరగ్ కాలనీలో పార్కుగోడ కాలువలో కూలిపోవడంతో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తోందని, గోడ నిర్మించి, పార్కును ప్రజలకు అప్పగిస్తే సుందరంగా అభివృద్ధిచేస్తామని శ్రీనివాస అపార్టుమెంటు ప్రతినిధులు డి.వెంకటేశ్, కుమార్ వేనుగోపాల్ తదితరులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

 ఎచె ్చర్ల మండలం ఎస్.ఎం.పురం రెవెన్యూ ఫరీదుపేట పంచాయతీ పరిధిలో 2.03 ఎకరాల్లో వేసిన రియల్ ఎస్టేట్‌లో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు కె.అమ్మినాయుడు ఫిర్యాదు చేశారు.

 

 పట్టాదారు పాసుపుస్తకం మంజూరుకు లంచం తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని లావేరు మండలం హనుమంతుపురం గ్రామానికి చెందిన డి.అక్కమ్మ కోరింది.

 

 జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనంలో రాత్రి కాపలాదారుగా పనిచేస్తున్న తనను తహశీల్దార్ బలవంతంగా బయటకు పంపించార ంటూ శ్రీకాకుళానికి చెందిన ఉలుకు సరోజిని కలెక్టర్ వద్ద వాపోయింది.

 నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామానికి చెందిన కె.అప్పారావు ఫిర్యాదు చేశారు.

 

 అంత్యోదయ కార్డు మంజూరు చేయాలంటూ ఎల్.ఎన్.పేట మండలం ధనువాడ గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు అనే వికలాంగుడు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు.

 

 తోటి డ్రైవర్లతో సమానంగా వేతనం ఇవ్వాలంటూ ఐటీడీఏలో పనిచేస్తున్న  సీతంపేట మండలానికి చెందిన ఎల్.ప్రకాశరావు కోరారు.

 

 రోడ్డుపై ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని జలుమూరు మండలం రాణ గ్రామానికి చెందిన వాద సింహాచలం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

 

 నష్టపరిహారం అందజేయడలో వివక్ష చూపిస్తున్నారంటూ కొత్తూరు మండలం ఓండ్రుజోల గ్రామానికి చెందిన ఉప్పాడ అప్పలనాయుడు ఫిర్యాదుచేశారు.

 

 ఎస్సీ రహదారిపై ఆక్రమణలు తొలగించాలని పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన వై.జగన్నాథరావు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

 ఉపాధిహామీ పథకం కింద ఒక్కో కుటుంబానికి నాలుగు పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నరసన్నపేట మండలం కంబకాయ గ్రామ సర్పంచ్ మహేశ్వరి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

 పోలీస్ గ్రీవెన్స్‌కు 12 వినతులు

 శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీసుకార్యాలయంలో సోమవారం నిర్వహించిన  గ్రీవెన్స్‌కు 12 వినతులు వచ్చాయి. ఓఎస్‌డీ అడ్మిన్ కె.తిరుమలరావు వచ్చిన  వినతులను పరిశీలించారు. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వచ్చిన వినతుల్లో సివిల్ తగాదాకు సంబంధించి నాలుగు, కుటుంబ కలహాలపై మూడు, పాత కేసు విషయమై ఒకటి, పాతవి నాలుగు ఉన్నాయి. కార్యక్రమంలో డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, టి.మోహనరావు, కె.వేణుగోపాలనాయుడు, దేవానంద్‌శాంతో, పెంటారావు, రిజర్వుడ్ ఇన్‌స్పెక్టర్‌లు ప్రసాదరావు, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top