పుష్కర పనులపై కొరవడ్డ చర్చ


రాజమండ్రి సిటీ  : రాజమండ్రి నగర పాలక మండలి సమావేశంలో కీలకమైన పుష్కరాల పనులపై చర్చ కొరవడింది. నగర పాలక మండలి సమావేశం సోమవారం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలో రెండు గంటలు ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. ై వెఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి పుష్కరాల సమయం దగ్గర పడుతున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. నగరంలో పుష్కర పనులు ఏమిచేయబోతున్నారు, సుందరీకరణ మాటేమిటి అని ప్రశ్నించారు.టీడీపీ సభ్యులు ఆమెకు అడ్డ్డుతగలడంతో కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది.

 

 కాగా నగర పాలక సంస్థ అధికారులు అవినీతిపరులుగా మారిపోయారని, సంస్థ రావలసిన ఆదాయూన్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధ్వజమెత్తారు. రూ.లక్షల ఆదాయం వచ్చే సులభ్ కాంప్లెక్స్‌లకు మరమ్మతులు చేసి వేలం నిర్వహించక పోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఉద్యోగులకు పదోన్నతుల్లో జాప్యం, కొత్తగా కొనుగోలు చేసిన జేసీబీని నెలరోజుల పాటు మూలన పెట్టడం, చెత్త మిషన్ కొనుగోలుకు ఆమోదం, పుష్కర ఘాట్‌లలో తాత్కాలిక మరుగుదొడ్ల టెండర్ వంటి అంశాల్లో గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు. వాటిపై సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.

 

 రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 35 సులభ్ కాంఫ్లెక్స్‌ల ద్వారా ఏటా రూ.25 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఆరోగ్యశాఖాధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, నగరపాలక సంస్థ ఆదాయాన్ని పందికొక్కుల్లా తినేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా. అన్నిశాఖల్లో ఉన్న అలాంటి పందికొక్కులను తక్షణమే పంపేయూలని కమిషనర్‌ను  కోరాారు. 10 రోజుల్లో పరిసర గ్రామాలు నగరపాలక సంస్థల్లో కలుస్తున్నాయని, కొన్ని గ్రామాలను తప్పించి విలీనం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. పుష్కర పనుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ సమస్య వచ్చిన వెంటనే అధికారులు పరిష్కారం కోసం ప్రయత్నించాలి తప్ప కౌన్సిల్ మీటింగ్ వరకూ ఆగడమేంటని ప్రశ్నించారు. ఒక దశలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి, ఎమ్మెల్యే ఆకులకు కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు తూతూమంత్రంగానే సమాధానాలు చెప్పారు.

 

 ఎన్టీఆర్, బాపు, రమణల విగ్రహాలొద్దు..

 ప్రశ్నోత్తరాల అనంతరం ఎజెండా ప్రవేశపెట్టి  పారిశుద్ధ్య కార్మికుల నియూమకం, గోదావరి ఒడ్డున కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర హం, బాపు, రమణల విగ్రహాల ఏర్పాటు, ఆస్తిపన్ను తదితర అంశాలపై చర్య నిర్వహించారు. గోదావరి ఒడ్డున జిల్లాకు గానీ, నగరానికి గానీ ఏమీ చేయని సినీ ప్రముఖుల విగ్రహాలు ఏవిధంగా పెడతారంటూ వైఎస్సార్  సీపీ కార్పొరేటర్  బొంతా శ్రీహరిరావు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 10.30 గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం 5 గంటల వరకూ జరిగింది.

 

 భారీ బందోబస్తు

 గత సమావేశంలో జరిగిన పరిణామాలు పునరావృతం కాకుండా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అందరినీ క్షుణ్ణంగా తనిఖీచేసి మరీ సమావేశం హాలులోకి అనుమతించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులను తప్ప ఎవరినీ అనుమతించలేదు. గత సమావేశంలో వివాదానికి కారణమైన సీట్ల సమస్య తలెత్తకుండా సీట్ల వద్ద సభ్యుల పేర్లు రారుుంచారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top