భలే చాన్సులే దోపిడీకి..


 సర్‌చార్జితో రైల్వే.. 50 శాతం పెంపుతో ఆర్టీసీ..

 అదే దారిలో భారం వేయనున్న ప్రైవేట్ వాహనాలు

 12 గంటలకే రోజు అద్దె వసూలు చేయనున్న లాడ్జిలు

 నియంత్రించేందుకు కానరాని ప్రయత్నాలు

 

 రాజమండ్రి :గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులపై ఆర్థికభారం మోపి, సొమ్ము చేసుకునేందుకు అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు సంస్థలు  సిద్ధమవుతున్నారుు. పుష్కరాలను సొమ్ము చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రజారవాణా సంస్థలైన రైల్వే, ఆర్టీసీ దొడ్డిదారిన ప్రయాణికులను దోచుకునేందుకు చూస్తుంటే.. ఇక ప్రైవేటు రవాణా సంస్థలు,  లాడ్జిలు, హోటళ్లు భక్తుల నుంచి అదనపు చార్జీలు గుంజనున్నారుు. పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం పుష్కరాలకు 4 కోట్ల మందికి పెబడి వస్తారని అంచనా. ఇందుకు తగ్గట్టుగా రైళ్లు, ఆర్టీసీ బస్సులను వేయడంలో ప్రభుత్వం పెద్దగా చొరవ చూపడంలేదు.

 

  పైగా పుష్కరాలకు వేసే ప్రత్యేక రైళ్లపై టికెట్టుకు సర్‌చార్జి పేరుతో రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. చైర్ కార్, జనరల్ టికెట్, స్లీపర్లపై రూ.5 చొప్పున, థర్డ్ ఏసీపై రూ.10చొప్పున, సెకండ్ ఏసీకి రూ.15 చొప్పున, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ.20 చొప్పున సర్‌చార్జి వసూలు చేయనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీ పుష్కరాలకు ప్రయూణికుల నుంచి భారీ దోపిడీకి తెరతీస్తోంది. కాలం చెల్లిన బస్సులు, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలోని సిటీ బస్సులనే పుష్కరాలకు ప్రత్యేక బస్సులుగా వేస్తున్నారు. ఈ సర్వీసులలో చార్జీలు 50 శాతం పెంచనున్నారు. ట్రైన్లు, బస్సులు అవసరమైన స్థాయిలో వేయకపోవడాన్ని అవకాశంగా తీసుకుంటున్న ప్రైవేటు వాహనదారులు కూడా అందినకాడికి దోచుకునే పనిలో ఉన్నారు. పుష్కర వేళల్లో కాల్ టాక్సీలు, టాటా ఏసీలు, మ్యాజిక్, జీపులు తదితర ప్రైవేటు వాహనాలకు కూడా రెండు మూడు రెట్లు చార్జీలు వసూలు చేయనున్నారు. వీటి నియంత్రణకు రవాణా శాఖ ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు.

 

 బస భారమే..

 రాజమండ్రిలో పుష్కరాలకు బస చేసే ప్రయాణికులపై చార్జీల పిడుగులు పడనున్నాయి. ఇప్పటికే నగరంలో చాలావరకు హోటళ్లు ముందుగానే బుక్ అయిపోయాయి. సాధారణంగా లాడ్జిలో గదులు 24 గంటల ప్రాతిపదికన ఇస్తారు. పుష్కరాల నేపథ్యంలో కొన్ని లాడ్జిలు చార్జీలు పెంచడం లేదంటూనే అదే ధరకు 12 గంటలకు మాత్రమే గదులు ఇవ్వడానికి ప్రణాళిక వేస్తున్నారు. అంటే ఒక రోజు బస చేసే భక్తులు రెండు రోజులకయ్యే ఖర్చు పెట్టాల్సిందే. కొన్ని లాడ్జిలలో గదులు సాధారణ రోజుల్లో రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉంటే పుష్కర రోజుల్లో రూ.3 వేల నుంచి రూ.4 వేలన్నా గదులు దొరకని పరిస్థితి. కొన్ని లాడ్జిలు గదులు బ్లాక్ చేసి పెట్టుకుంటున్నాయి. మరోపక్క పుష్కర రోజుల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చాయ్ దుకాణాల్లో రేట్లు పెంచేయనున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top