చెత్త @ రూ. కోటి

చెత్త @ రూ. కోటి


25 వేలకు పైగా ర్యాగ్ పిక్కర్స్..  ఆదాయం రూ. కోటి

దేశవ్యాప్తంగా ప్రథమస్థానంలో ముంబై

భాగ్యనగరానిది ఐదో స్థానం


 

ఒక రోజు సంపాదన రూ.800 పైనే  నగరంలో 25 వేలకు పైగా ర్యాగ్ పిక్కర్స్ ఉన్నారని డాన్ బాస్కో నవజీవన్ అనే సంస్థ సర్వేలో తేలింది. వీరంతా కలసి చెత్తను వ్యాపారులకు విక్రయించి రోజుకు సుమారు కోటి రూపాయలు సంపాదిస్తున్నారంటే అశ్చర్యం కలగకమానదు. చెత్త ఏరుకు నేవారి ఒకరోజు సగటు సంపాదన  రూ.800- 1,000 వరకు ఉంటుం దని అంచనా.  నగరంలో 55 వేలకు పైనే వీధి బాలలున్నా రని, వీరిలో చాలామంది చెత్త ఏరుకునేవారేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

 

ఏటా మెట్రో నగరాల్లో చెత్త విడుదలపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ(అస్కి) సర్వే నిర్వహించింది. గణాంకాలు ఇవీ..

 

మహానగరాల్లో చెత్త  (ఏటా.. మెట్రిక్ టన్నుల్లో)

ముంబై   - 8,000

ఢిల్లీ        - 6,000

చెన్నై     - 4,500

బెంగళూరు  - 3,000

హైదరాబాద్  -  2,600

 

2011 లెక్కల ప్రకారం ఏటా 4 శాతం జనాభా పెరుగుతుండగా, చెత్త 5 శాతం అదనంగా పోగవుతోంది.వ్యాపారులు చెత్తను కిలోల చొప్పున కొనుగోలు చేస్తుంటారు. పాల ప్యాకెట్లు రూ.10, అట్టలు రూ.4, న్యూస్‌పేపర్లు రూ.10, చిత్తు పేపర్లు రూపాయి. దీన్ని ఫ్యాక్టరీలకు తరలిస్తారు.  హైదరాబాద్ నుంచి రోజూ టన్నుల కొద్దీ చిత్తుకాగితాలు, అట్టలు  రాజమండ్రి, సిర్‌పూర్ కాగజ్‌నగర్, నాగపూర్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల పేపర్ మిల్లులకు భారీ పరిమాణంలోనే ఎగుమతి అవుతున్నాయి. మద్యం సీసాలు, గ్లాస్‌లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఫ్యాక్టరీల్లో  కొత్త రూపును సంతరించుకొని తాజా వస్తువులుగా మళ్లీ మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.

 

‘‘30 ఏళ్ల నుంచి చెత్త వ్యాపారం చేస్తున్నా. గతంలో చెత్త వ్యాపారం అంటే చులకనగా చూసేవారు. కానీ నేడిది లాభసాటిగా మారింది. నా దగ్గర 200 మంది కూలీలు పనిచేస్తున్నారు.10 ఏళ్ల క్రితం కిలో చెత్తను 25 పైసలకు కొనుగోలు చేసేవాళ్లం. ఇప్పుడు.. కనీస ధర రూ. 2.’’ అని కూకట్‌పల్లిలో చెత్త సేకరణ, వ్యాపారం చేసే మదీనా ట్రేడర్స్ నిర్వాహకుడు అంజత్ ‘సాక్షి సిటీప్లస్’కు చెప్పారు.3,800టన్నులు గ్రేటర్‌లో రోజువారీ చెత్త బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.కోటి పైమాటే చెత్త ఏరుకునేవారు 25 వేలమందికిపైనే .హైదరాబాద్ మహానగరంలో ప్రతివ్యక్తి ఒక్క రోజులో 200నుంచి 600 గ్రాముల చెత్తను పారేస్తుంటారని  అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ (అస్కి) సర్వే చెబుతోంది. ఒక్కో ర్యాగ్ పిక్కర్(చెత్త సేకరించేవారు) రోజుకు సగటున 15-20 కి.మీ. మేర తిరిగి చెత్తను సేకరిస్తున్నారు.   

 

ఒకరోజులో మన భాగ్యనగరంలో చెత్త బిజినెస్ ఎంతో తెలుసా..  అక్షరాల కోటి రూపాయలు.  ఆ వ్యాపారం చేసేవారు కచ్చితంగా బడా వ్యాపారులై ఉంటారని అనుకుంటున్నారు కదూ! అయితే మీరు ‘చెత్త’లో కాలేసినట్టే.  వారు నిజంగా చెత్త ఏరుకునేవాళ్లే (ర్యాగ్ పిక్కర్స్)!!  రోజూ మనం వాడి పడేసే చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, సీసాల వంటి రకరకాల చెత్తను సేకరిస్తుంటారు. బహిరంగ మార్కెట్లో వీటిని విక్రయించి డబ్బులు సంపాదించుకుంటారు. చెత్తను ఏరుకునే వాళ్లకు సంఘాలు, దుకాణాలూ ఉన్నాయండోయ్. వీరు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నుంచి చెత్తను సేకరించేందుకు బిడ్స్ కూడా వేస్తున్నారు.  మనం రోజూ వాడి పడేసే చెత్త బహిరంగ మార్కెట్లో కోట్లాది రూపాయల విలువ చేస్తోందని ‘అస్కి’ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

 

ఈ ప్రాంతాల్లో చెత్త సేకరణ అధికం...



సికింద్రాబాద్, బొల్లారం, జీడి మెట్ల, సనత్‌నగర్, తిరుమలగిరి,  దిల్‌సుఖ్ నగర్, అఫ్జల్‌గంజ్, ఎల్బీన గర్, ఉప్పల్ ప్రాంతాల నుంచి రోజూ 60 శాతం చెత్త సేకరణ జరుగుతోందని కూకట్‌పల్లికి చెందిన మదీనా ట్రేడర్స్ నిర్వాహకుడు అంజత్ వివరించారు. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ల నుంచి రోజూ 10 టన్నుల చెత్త సేకరిస్తున్నట్లు వ్యాపారి వెంకన్న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల ఆఫీసులు, పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు, రైల్వే, బస్సు స్టేషన్లు, మింట్ కాంపౌండ్ వంటి ప్రతి సంస్థల్లోనూ విడుదలయ్యే చెత్తను సేకరించేందుకు ఏడాదికోసారి టెండర్లు కూడా ఉంటాయి. ఏడాదికి కనీసం 200 టన్నుల నుంచి 500 టన్నుల చెత్త విడుదలవుతోందని కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో టెండర్ దక్కించుకున్న ఓ వ్యాపారి చెప్పారు.



 3,800 టన్నుల చెత్త వ్యాపారం



ఒక్క రోజుల్లో హైదరాబాద్‌లో 3,800 టన్నుల చెత్త వ్యాపారం అవుతోందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఇందులో ప్లాస్టిక్ 1,400, పేపర్లు 800, సీసాలు 1,200, అట్టలు 400 టన్నుల చొప్పున ఉన్నాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తు న్నాయి. బహిరంగ మార్కెట్‌లో 3,800 టన్నుల చెత్త విలువెంతో తెలుసా.. అక్షరాలా కోటి రూపాయలు. అంటే నెలకు 30 కోట్ల రూపాయలు. ఏడాదికి రూ.365 కోట్లు ఆర్జిస్తున్నారు.

 

ప్లాస్టిక్ టీ గ్లాసులు, కవర్లు, పత్రికలు, కాగితాలు, మద్యం సీసాలు, అట్టలు, కాటన్ డబ్బాలు... వాడేస్తే చెత్త. చెత్త కనబడగానే ముక్కు మూసు కుంటాం...  కాని ‘చెత్త’ బిజినెస్ చూస్తే ముక్కున వేలేసుకోవా ల్సిందే..! పారేస్తే వ్యర్థం.. ఏరేస్తే ‘అర్థం’..!  పనికిరానిది.. ‘మనీ’కి వస్తుంది..! రోజుకు కోటి రూపాయల చెత్త బిజినెస్ నడుస్తోంది. చెత్త సేకరించేవారు రోజుకు రూ.800 నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారు. 



- ఆడెపు శ్రీనాథ్, హైదరాబాద్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top