అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ ఇచ్చాం

అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ ఇచ్చాం - Sakshi

  • దావోస్‌లో సీఎం చంద్రబాబు

  • నేడు యూరోపియన్‌ తెలుగు ప్రజలతో సమావేశం

  • సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించామని, ఇకపై డిజిటల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వ పరిపాలనంతా ఆన్‌లైన్‌లో ఉందని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితర అన్ని విభాగాలు క్లౌడ్‌లో ఉన్నాయని తెలిపారు. దావోస్‌ నుంచే తాను డ్యాష్‌ బోర్డు చూస్తూ ఆదేశాలు జారీ చేయగలనని, ఇక్కడి నుంచే ఫైళ్లను కోర్‌ డ్యాష్‌ బోర్డు సాయంతో పరిష్కరించగల నన్నారు. దావోస్‌లో శుక్రవారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో ఇంటర్నెట్‌ ఫర్‌ ఆల్‌ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ వివరాలతోపాటు పలు సంస్థలతో జరిగిన సమావేశాల వివరాలను ఆయన కార్యాలయ మీడియా విభాగం విడుదల చేసింది. శుక్రవారంతో ముఖ్యమంత్రి బృందం దావోస్‌ పర్యటన ముగిసింది. శనివారం జురిచ్‌ చేరుకుని యూరోపియన్‌ తెలుగు ప్రజల సమావేశంలో పాల్గొననున్నారు.



    పలు సంస్థలతో  సమావేశం..

    ► విశాఖలో టెక్నాలజీ సెంటర్‌ నెలకొ ల్పాలని మాస్టర్‌కార్డ్‌ అంతర్జాతీయ మార్కెట్ల అధ్యక్షుడు ఎన్‌కేన్స్‌ను ముఖ్యమంత్రి కోరారు.

    ►రాష్ట్రంలో 300 మెగావాట్ల సామర్థ్యం గల పవన్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు అవకాశాన్ని పరిశీలిస్తామని అబ్రాజ్‌ గ్రూప్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కునాల్‌ పరేఖ్‌ హామీ ఇచ్చారు.

    ► ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఈడీబీ)ను మరింత బలోపేతం చేసేలా శిక్షణ ఇచ్చేందుకు సింగపూర్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ బెహ్‌ స్వాన్‌ జిన్‌ అంగీకరించారు.

    ► ఎయిర్‌బస్‌ సంస్థ సీఈఓ డర్క్‌ హూక్, ఆటో గ్రిడ్‌ సిస్టమ్స్‌ సీఈఓ, పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్, ఎఫ్‌టీ క్యాష్‌ వ్యవస్థాప కుడు లోథా, డబుల్‌ యుఈఎఫ్‌ సాంకేతిక మార్గదర్శి అమిత్‌ నారాయణ్‌తో బాబు వివిధ అంశాలపై చర్చించారు. విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్‌ను కోరారు.  

    ► వ్యవసాయం, ఉద్యానం, ఆక్వా, డెయిరీ తదితర అంశాల్లో నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఉండేం దుకు నెదర్లాండ్‌కు చెందిన వేగెనింజన్‌ యూనివర్సిటీ అండ్‌ రీసెర్చి ప్రతినిధి డాక్టర్‌ రోథియస్‌ అంగీకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top