సమైక్యంగా ఉందాం.. సమరం చేద్దాం

సమైక్యంగా ఉందాం.. సమరం చేద్దాం - Sakshi


తాడేపల్లిగూడెం : వ్యాపారులంతా సమైక్యంగా ఉంటూ.. సమస్యల పరి ష్కారం కోసం సమరం సాగించాలని సీమాంధ్రలోని వ్యాపార రంగాని చెందిన ప్రతినిధులు నినదించారు. స్థానిక గమిని ఫంక్షన్ ప్లాజాలో మంగళవారం సీమాంధ్ర ప్రాంత వర్తక సంఘ ప్రతిని ధుల సమావేశం తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ మిల్లర్స్ అధ్యక్షుడు గమిని సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించి, నాన్‌బెయిలబుల్ సెక్షన్ చొప్పిస్తే వ్యాపారులంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి సెక్షన్ల వల్ల చాలామంది ఆస్తులు కోల్పోయి, అనారోగ్యం పాలయ్యూరని గుర్తు చేశారు.

 

 మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే నాన్‌బెయిలబుల్ సెక్షన్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయూలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ చాంబర్ ఆఫ్ మర్చంట్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ వ్యాపారాలకు దశ, దిశ లేకపోవడంతో చాలా నష్టం జరిగిందన్నారు. అంతా కలసి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేశామని, రాష్ట్రం విడిపోవడంతో రాత్రికి రాత్రే వ్యాపారాలను వదిలేసి సొంత జిల్లాలకు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోధుమ ఆధారిత పరిశ్రమలు తెలంగాణలో ఉండిపోవడం వల్ల ఆ  ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చుకోవడానికి వ్యాట్, సీఎస్‌టీ చెల్లించాల్సి వస్తుందన్నారు.

 

 రోజువారీ అవసరాల కోసం తెలంగాణలోని 39 మిల్లుల నుంచి 1,260 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. పంచదారపై ఏ రాష్ట్రంలోనూ వ్యాట్ లేదని, మన రాష్ట్రంలో మాత్రం వసూలు చేస్తున్నారని తెలి పారు. చాలా సరుకులను ఇక్కడ వ్యాట్ పరిధిలోకి తీసుకెళ్లారన్నారు. ఇవి చాలవన్నట్టుగా నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి ఉల్లిపాయలు, బంగాళా దుంపలను చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో సిద్ధం చేసిందని, అది ఎప్పుడైనా బయటకు రావచ్చని అన్నారు. నిత్యావసర సరుకుల చట్టంలో నాన్‌బెరుులబుల్ సెక్షన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని, దీనిని అడ్డుకునేందుకు వ్యాపారులంతా సమైక్యంగా పోరాడాలన్నారు.

 

 ఇలాం టి జీవోలు వస్తే అధికారులు తీసుకునే మామూళ్లను పెంచేసి వేధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయూలపై సీమాంధ్రలోని అన్ని జిల్లాల వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు. భీమవరం వర్తక సంఘ ప్రతినిధి సభాపతి, అత్తిలి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం వ్యాపార వర్గ ప్రతినిధి కర్పూరం నారాయణరావు, తణుకు చాంబర్ ప్రతినిధి గమిని రాజా, తాడేపల్లిగూడెం చాంబర్ కార్యదర్శి నరిశే సోమేశ్వరరావు, వివిధ జిల్లాల వ్యాపార సంఘాల ప్రతినిధులు నాన్ బెయిలబుల్ సెక్షన్‌ను నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని నిరసించారు.

 

 వ్యాపారుల్ని సంప్రదించాలి

 వ్యాపారాలకు సంబంధించి చట్టా లు చేసే సమయంలో ప్రభుత్వం ఆయా విభాగాల వారితో సంప్రదించాలి. భయంకర యాక్టులు వ్యాపారులపై రుద్దకండి. పన్నులు చెల్లించకుంటే ఖజానా ఎలా నిండుతుందని అడుగవద్దు. వ్యాపారుల నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తుందో చెప్పండి. ఈసీ యాక్టులో నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే వ్యాపారులకు వేధింపులు, అధికారులకు ఆదాయం పెంపుదల తప్ప వేరే ప్రయోజనం ఉండదు.          - కొప్పు సత్యనారాయణ, పాలకొల్లు

 

 భారాలు మాపై మోపుతారా

 ప్రజలకు అవి ఉచితంగా ఇస్తాం.. ఇవి ఉచితంగా ఇస్తాం అని హామీలు ఇస్తారు. ఆ భారం మోయడానికి వ్యాపారులే ప్రభుత్వానికి కనిపిస్తున్నారు. రెవెన్యూ లోటు పూడాలంటే వ్యాపారులే దొరికారా. జంబ్లింగ్ తనిఖీల పేరిట వ్యాపారులను భయాందోళనలకు గురి చేయవద్దు. ఈసీ యాక్టులో నాన్ బెయిలబుల్ సెక్షన్ వద్దే వద్దు.

 -  కాగిత వెంకటరమణారావు, ప్రధాన కార్యదర్శి, జిల్లా వర్తక, వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top