ఆపరేషన్ థియేటర్లో గర్భిణి మృతి

ఆపరేషన్ థియేటర్లో గర్భిణి మృతి

  •   వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు

  •   గవర్నర్‌పేట స్టేషన్‌లో కేసు

  • విజయవాడ : పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో ఎనిమిది నెలల గర్భిణి మంగళవారం రాత్రి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లిన  కొద్దిసేపటికే మరణించడం వివాదాస్పదమైంది. ఆస్పత్రిలో చేరి రెండురోజులైనా వైద్యులు పట్టిం చుకోలేదని ఆమె భర్త, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో ఆపరేషన్ చేసి ఉంటే బతికేదని వారు పేర్కొంటున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో వారు సిబ్బందితో కొంతసేపు గొడవ పడ్డారు.



    ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జి.కొండూరు మండలం కట్టుబడివారిపాలేనికి చెందిన ద్రోణాదుల పావని(20)కి ఏడాదిన్నర కిందట గుడివాడకు చెందిన నీలకంఠంతో వివాహమైంది. పావని ప్రస్తుతం 34 వారాల గర్భిణి. అధిక రక్తపోటుతో బాధపడుతుండటంతో ఈనెల 21న ఆమెను పాత ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి ఆస్పత్రిలో చేర్చుకున్నారు. మంగళవారం ఉద యం వైద్యులు మరోమారు పరీక్షించి కడుపులో శిశువు చనిపోయిందని ఒకసారి, బాగానే ఉం దని ఇంకోసారి రకరకాలుగా చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు.



    పావనిని ఈనెల 12న ఆస్పత్రికి తీసుకురాగా, రెండురోజులు ఉంచి పంపివేశారని వారు పేర్కొంటున్నారు.  పావని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారని, ఐదు ని ముషాల లోపే చనిపోయిందని  చెప్పారని బంధువులు తెలిపారు. పావని మృతికి కారకులై న వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డి మాండ్ చేశారు. శిశువు దక్కకపోయినా తల్లిని కాపాడాలని వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదని పావని తల్లి విలపిస్తూ చెప్పింది.



    వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతిచెందిందని పే ర్కొంటూ పావని భర్త నీలకంఠం అదేరో జు రాత్రి గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు కేసు నమోదైంది.  పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో బందోబస్తు ని ర్వహించారు. మృతదేహాన్ని బుధవారం ఉద యం కొత్త ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అ ప్పగించారు. ఈ సందర్భంగా మృతురాలి బం ధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించి, మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు.

     

    వైద్యులు ముందే వివరించారు

     

    పావనిని ఈనెల 12 బంధువులు ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. 14న ఆమెను ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ త్రిపురసుందరీదేవి పరీక్షించారు. గర్భం తొలగిస్తేనే రక్తపోటు అదుపులోకి వస్తుందని, లేకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. మరుసటిరోజు గర్భం తొల గించేందుకు వైద్యులు నిర్ణయించారు. 15వ తేదీ ఉదయానికి పావని వార్డులో కనిపించలేదు. దీంతో అబ్‌స్కాండింగ్‌గా కేస్‌షీట్‌లో నమోదు చేశారు. పావనిని తిరిగి ఈనెల 21న బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యు లు పరీక్షించి, గర్భం తొలగించేందుకు జెల్, టాబ్లెట్లు వాడారు. ఆమె పరిస్థితి క్రమేపీ విషమిస్తుండటంతో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి శిశువును తొలగిస్తుండగా అకస్మికంగా మృతిచెందింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి గుండె ఆగిపోతుంది.. లేదా కిడ్నీలు పనిచేయవు. గర్భిణి మృతికి కారణం ఏమిటనేది ఖచ్చితంగా నిర్ధారించలేం.

     

    - డాక్టర్ సూర్యకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top