నక్షత్ర వర్ణాల్లో క్రిస్మస్ ట్రీ..


క్రిస్మస్ వేడుక అంటే చాలు నగరమంతా నక్షత్ర కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇది ఓ అందాల పండగ. కోటి ఆశలతో క్రీస్తును వేడుకుంటూ ప్రభువు ఆలోచనలతో ఓ నెల రోజుల పాటు చేసుకునే చక్కని ఉత్సవం. ఆ సెలబ్రేషన్స్ వేళలో ప్రతి రోజు దీపపు కాంతుల్లో నక్షత్ర వర్ణాల్లో చక్కని క్రిస్మస్ ట్రీ మాటున చూడచక్కగా చేతితో తయారు చేసిన బొమ్మలతో కనువిందుగా.. జీసస్ శరణుఘోషలో, శాంతాక్రాజ్ ఆటలతో అలా అదో అందమైన ప్రపంచంలా ఉంటుంది. క్రిస్మస్ వేడుకలు నగరంలో జరుగుతున్న తీరుపై సిటీప్లస్ కథనం.

 

 పండగలంటే ఎప్పుడూ ప్రత్యేకమే.. కోటి ఆశలతో జీవితంలో ప్రయాణించే మనిషికి కాస్త ఉత్సాహాన్నిచ్చి.. భగవంతుని ఆలోచనల్లోకి తీసుకుపోతాయి. అలాంటి పండగ సంబరాలు ఎవరికైనా ప్రత్యేకమే. నగరంలో ఏ వీధిలో చూసినా, ఏ చర్చి చూసినా ఆ ప్రభువు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడా అనే ఫీలింగ్ మనస్సును తాకే విధంగా ప్రత్యేక డిజైన్స్ చేస్తున్నారు.



కాగితాలతో కలర్‌ఫుల్ డిజైన్స్, మెరిసే నక్షత్రాలు, తారల తళుకులు ఇదంతా అలంకరణలో ఓ ఎత్తయితే.. ఆ నెల రోజుల కాలం పిల్లల నుంచి పెద్దల వరకు చేసే సంబరాలు, చిన్నారుల డిఫరెంట్ డ్రెస్సింగ్‌లతో ఆడుపాడుతూ అల్లరి చేస్తుంటే. పెద్దలు క్రీస్తు చరిత్రను గానం చేస్తుంటారు. డిసెంబర్ మాసంలో ఆదివారం వస్తే ఏదో ఓ చర్చిలో అలా ఆటవిడుపు, పాఠశాలలో సందళ్లు.. ఇవన్నీ కనిపిస్తున్నాయి.



ప్రస్తుతం విశాఖ నగరంలో. అలానే క్రీస్తు పుట్టుక ప్రతి ఇంట్లో పండుగ, అందుకే సిటీ మార్కెట్లో ఇంటిని క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అందంగా డిజైన్ చేసుకునేందుకు మార్కెట్లో సరికొత్త డిజైన్స్‌తో ఉన్న రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి.  ప్రస్తుతం సిటీలో ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడే కనిపిస్తోంది. రంగుల నక్షత్రాలు చీకటి వెలుగుల్లో అలా మెరిసిపోతు క్రీస్తు రాకను గుర్తు చేస్తున్నాయి.



christmas, pre-Christmas celebrations, visakha, క్రిస్మస్, సెలబ్రేషన్స్,  విశాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top