అన్న ప్రసాద ప్రయాస

అన్న ప్రసాద ప్రయాస

  • సింహాచలం ‘సిత్రాలు’

  •  గంటల తరబడి భక్తుల నిరీక్షణ

  •  అన్నదాన సత్రంలో వినియోగంలో ఉన్నది ఒక అంతస్తే..

  •  నత్తనడకన సాగుతున్న క్యూ కాంప్లెక్స్

  • అప్పన్న అన్న ప్రసాదం స్వీకరించాలంటే గంటలతరబడి నిరీక్షణ తప్పదు. భారీ అన్నదాన సత్రం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవటం భక్తులకు శిక్షగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు అవస్థలు పడుతున్నారు.

     

    సింహాచలం : దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా సింహగిరిపై సుమారు రూ. 4 కోట్లు వెచ్చిం చి భారీ అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఒకేసారి 700 మంది వరకు భక్తులు కూర్చు ని భోజనం చేసే విధంగా రెండంతస్తులు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితం నుంచి భక్తులకు ఆ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దివ్యక్షేత్రం పనులు జరుగుతున్నప్పుడు తాత్కాలిక భవనాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ పక్కా భవనం నిర్మించాక తొలగిపోతాయని భక్తులు భావించారు.



    తీరా చూస్తే పరిస్థితి యథాతథంగానే ఉండటంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.సింహగిరిపై నిత్యాన్నదాన భవనం వద్ద ప్రతిరోజు చోటు చేసుకుంటున్న వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి. లక్ష్మీ నృసింహస్వామి ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటా రు. భక్తులకు దేవస్థానం నిత్యాన్నదాన పథకంలో ప్రతి రోజూ అన్నదానం చేస్తోంది. వీరి సౌకర్యార్థం సుమారు రూ.4 కోట్లు వెచ్చించి రెండంతస్తుల్లో  నిర్మించిన భవననాన్ని ఏడాదిన్నర క్రితం అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి క్రింది అంతస్తులోనే భక్తులకు అన్నదానం చేస్తున్నారు.



    రెండవ అంతస్తును వినియోగించడం లేదు. దీంతో భక్తులు గంటల తరబడి  వేచి ఉండాల్సి వస్తోంది. వీరి కోసం పక్కా క్యూ కాంప్లెక్స్ నిర్మించలేదు. భవనానికి సమీపంలో ఉన్న తాత్కాలిక రేకుల షెడ్‌లో భక్తులు గంటల తరబడి నిలబ డాల్సి వస్తోంది. వృద్ధులు, చిన్నారులతో వచ్చిన భక్తులు పడుతున్న ఇబ్బందులు దయనీయం.



    శని, ఆదివారాలు, ఉత్సవాల రోజుల్లోనైతే  మండుటెండలో భక్తుల క్యూ బారులు తీరి ఉంటుంది. గంటల తరబడి నిలబడలేక భక్తుల మధ్య తోపులాటలు కూడా జరుగుతున్నా యి. ఆకలి బాధలు తట్టుకోలేక దూసుకెళ్తున్న పరిస్థితులున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. సిబ్బంది కొరత వల్ల పై అంతస్తులో భోజనం సదుపాయాన్ని ఏర్పా టు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. భక్తులు వేచి ఉండేందుకు రూ. 8 లక్షలతో  క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టామని, తొందరలోనే పూర్తవు తుందంటున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top