ఐటీడీఏలో ఎమ్మెల్యే ‘ప్రజాదర్బార్’

ఐటీడీఏలో ఎమ్మెల్యే ‘ప్రజాదర్బార్’


 సీతంపేట : తన నియోజకవర్గంలోని సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం ఐటీడీఏలో ప్రత్యేక గిరి జన దర్బార్ నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని కొత్తూ రు, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళి యాపుట్టి మండలాల్లోని గిరిజన గ్రామాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌ల తో సహా పెద్ద ఎత్తున గిరిజనులు హాజరై ఎమ్మెల్యే, అధికారులకు తమ సమస్యలు విన్నవించారు. ప్రాజెక్టు అధికారి ఎన్.సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాస్, ఎం.వీ.రమణ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన దొర ఎమ్మెల్యేతో పాటు అర్జీలు స్వీకరించారు.

 

 వీలైనన్ని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. 30కి పైగా వినతులు చెరువులు చెక్‌డ్యాంలు కావాలని, దాదాపు 50 గ్రామాల వరకు రోడ్లు నిర్మించాలని, మరమ్మతు లు చేపట్టాలని వినతులు వచ్చాయి. మెట్టూరు నుంచి గొట్టిపల్లి గ్రామ రహదారిని బాగు చేయాలని, సవర శంకాపురం, సంతోషపురం, బగద ల, జీడిబందల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని, కొత్తగూడలో తాగునీటి సమస్య పరిష్కరించాలని తదితర సమస్యలపై గిరిజనులు అర్జీలు అందించారు. వీటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మె ల్యే వెంకటరమణ అధికారులను కోరా రు. వారు పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక దర్బార్‌లో కొత్తూరు జెడ్పీటీసీ సభ్యురాలు పాలక ధనలక్ష్మి, ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, మెళియా పుట్టి వైస్ ఎంపీపీ దినకర్, సర్పంచ్‌లు రేగన మోహన్‌రావు, చిన్నబాబు, వైఎస్సార్ సీపీ నేతలు శివ్వాల కిషోర్, గంగు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top