బాలకృష్ణ పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్

బాలకృష్ణ పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్ - Sakshi


అనంతపురం: హిందూపురంలో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. బాలకృష్ణ హిందూపురం వచ్చిన సందర్భంగా ఆయనకు స్థానిక సమస్యలు తలెయజేయడానికి పలువురు ప్రయత్నించారు. వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. కౌన్సిలర్లను పోలీసులు తోసివేశారు.



దాంతో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు ఇది అన్యాయం అని నినదించారు. పట్టణ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. పోలీసులు తమపట్ల దురుసుగా ప్రవర్తించినందుకు వారు తీవ్ర నిరసన తెలిపారు.

***

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top