క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు


 శ్రీకాకుళం క్రైం: క్రికెట్ మ్యాచ్‌లు అవుతున్నాయంటే చాలు ఈ ముఠాకు పండగే పండగ. క్రికెట్ అభిమానులను ఆకట్టుకుని వారిని నెమ్మదిగా బెట్టింగ్ ముసుగులోకి దించుతారు. వారి అభిమానాన్నే ఆసరాగా చేసుకుని వేలు, ఆపై లక్షల రూపాయలను బెట్టింగ్ కాయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్-2015 మ్యాచ్‌లు ఈ ముఠాకు కల్పవృక్షంగా మారాయి. నెట్ చాటింగ్, సెల్‌ఫోన్లతో రూ.లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ సాగిస్తూ వచ్చారు. మధ్యవర్తిత్వం నిర్వహిస్తూ శ్రీకాకుళం పట్టణ కేంద్రంగా రూ.లక్షల్లో పొమ్మునార్జించే ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యులను శ్రీకాకుళం డిఎస్పీ కె.భార్గవ్‌రావ్‌నాయుడు తన కార్యాలయంలో ఆదివారం మీడి యా ముందు ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతుందన్న సమాచారంతో జిల్లా ఎస్పీ ఏఎస్.ఖాన్ బెట్టింగ్ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.

 

 తమ సిబ్బందికి తగు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో చిన్నబరాటం వీధిలోని ఓ సందులో ఉన్న గృహాంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నారాయణ శెట్టి వెంకట కిరణ్‌కుమార్ అలియాస్ కిరణ్, సత్యవరపు లవకుమార్ అలియాస్ లవ, టంకాల వెంకటరమణ అలియాస్ రమణ, పసుమర్తి కోటిబాబు అలియాస్ కోటి, నందిగాం శ్రీనివాసపట్నాయక్ అలియాస్ శ్రీను, మాణిక్యం సూరిబాబు అలియాస్ సూరి, తుమ్మ రామూర్తిలతో పాటు ఇంటి యజమాని పసుమర్తి జ్యో తిబాబు అలియాస్ జ్యోతిలను పోలీసు లు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక టీవీ, రూ.49,350 నగదు, 13 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 ప్రధాన సూత్రదారి కిరణ్

 క్రికెట్ బెట్టింగ్ ముఠాకు ప్రధాన సూత్రదారి కిరణ్‌కుమార్‌గా పోలీసులు గుర్తిం చారు. ఆయన గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహించినట్టు తెలియవచ్చింది. ముందుగా క్రికెట్ అభిమానులను గుర్తించడం, వారిని తన అనుయాయులతో మెల్లగా బెట్టింగ్ మాయలోకి దించడం ఈయన ప్రధాన విధి. కేవలం సెల్‌ఫోన్లపైనే మొత్తం బెట్టింగ్ తంతును సాగిస్తారు. క్రికెట్ లైవ్ సాగుతున్న సమయంలో పరుగులపై కూడా ఫోన్ల ద్వార బెట్టింగ్‌లు కాస్తుంటారు. ఒడిపోయిన వారి వద్దకు తను ముందుగా ఏర్పా టుచేసుకున్నవారు వెళ్లి డబ్బులు తేవ డం, గెలిచిన వారికి డబ్బులు ఇవ్వడం చేస్తుంటారు. ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠా లో దొరికిన ఎనిమిది మందిని పోలీ సులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ క్రైమ్ పార్టీ ఎస్సై వై.రవికుమార్‌ను, సిబ్బందిని ఎస్పీ ఖాన్ అభినందించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top