ఫంక్షన్లలో మిగిలింది..హాస్టల్ పిల్లలకు!


విద్యార్థుల యోగక్షేమాలను గాలికి వదిలేయడం సంక్షేమ హాస్లళ్లలో మామూలైపోయింది. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అధికారులు వారి జీవితంతో చెలగాటమాడుతున్నారు. తమకు కలిసి వస్తుందనుకుంటే.. ఆ పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేందుకు, వారికి కలుషితాహారం పెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. రాజమండ్రిలోని కొన్ని హాస్టళ్లలో వెచ్చాలు మిగుల్చుకునేందుకు కొంతమంది వార్డెన్లు నీచమైన పనులకు ఒడిగడుతున్నారు. వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన భోజనాన్ని హాస్లళ్లకు తరలించి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. కొంతకాలంగా రాజమండ్రి నగరంలో ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇది తెలిసి కూడా సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.



ఆస్పత్రిపాలయ్యారు. ఆ రోజు అక్కడి విద్యార్థినులకు సమీపంలోని ఒక ఫంక్షన్ హాలు నుంచి తెచ్చిన మిగులు ఆహార పదార్థాలను పెట్టారు. ఇది చూసి చుట్టుపక్కలవారంతా ముక్కున వేలేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకులు మాత్రం కాస్తంత కూడా భయపడలేదు. అదే రోజు రాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురైనా సిబ్బంది చేసిన తప్పులు బయట పడతాయని హాస్టల్‌లోనే ప్రథమ చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థినులు ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ మరికొందరు ఆస్పత్రిపాలవుతూనే ఉన్నారు. పదో తరగతి విద్యార్థిని గౌతమి శుక్రవారం రాత్రి ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో చేర్చారు. కాగా నగరంలోని పలు హాస్టళ్లలో విద్యార్థులకు ఇదేవిధంగా బయట ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలు తరలించి పెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



కానరాని పర్యవేక్షణ : సంక్షేమ హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాల్సిన అధికారులు కనీసం నెలకోసారి కూడా పట్టించుకోకపోవడంతో వార్డెన్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గత ఏడాది సీటీఆర్‌ఐ ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో విద్యార్థులచేత సిగరెట్లు, ఇతర నిషేధిత వస్తువులు తెప్పించుకుంటూ ఉద్యోగులు దొరికిపోయారు. ఆ సంఘటనలో విద్యార్థులను సిబ్బంది తీవ్రంగా కొడుతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అధికారులు వరుస సందర్శనలు చేసి పరిస్థితి చక్కదిద్దుతామని హామీలు ఇచ్చి వెళ్లిపోయారు. కానీ నెలలు గడవకుండానే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.



ఎంచక్కా లెక్కలు రాసేస్తున్నారు : బయటి ప్రాంతాల నుంచి తెచ్చిన ఆహారాన్ని రాత్రిళ్లు వడ్డించడం ద్వారా కొన్ని హాస్టళ్లలో మెనూకు మంగళం పాడేస్తున్నారు. కానీ చక్కగా వండి వడ్డించామని లెక్కలు రాసుకుని వెచ్చాలు మిగుల్చుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రొటీన్ మెనూకు బదులు బయటినుంచి మంచి వంట కాలు, బిర్యానీ వగైరాలు తెప్పించి పెడుతున్నామని విద్యార్థుల ముందు చెప్పుకుంటూ ఫంక్షన్ హాళ్లల్లో, ఇతర పరిచయస్తుల పార్టీల్లో మిగిలిపోతున్న ఆహారం తెచ్చి పెడుతున్నారని సమాచారం. ఇందుకోసం పలువురు క్యాటరింగ్ నిర్వాహకులతో కూడా కొంతమంది సిబ్బంది సంబంధాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.



ఈసారైనా పరిస్థితి మారుతుందా! : రాజమండ్రి ఘటనపై సబ్ కలెక్టర్ వి.విజయరామరాజును విచారణాధికారిగా కలెక్టర్ నియమించారు. గతంలో పలు సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇటువంటి విచారణలు జరిగినా వసతిగృహాల తీరుతెన్నులు మాత్రం ఎక్కడా మారలేదు. ఈసారైనా హాస్టళ్ల తీరులో మార్పు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు ఈ నెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఈ ఉద్యమ బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అమెరికాలో 20 రోజులు పర్యటించి తిరిగి వచ్చిన ఆయనకు.. మధురపూడి విమానాశ్రయంలో జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన నాయకులు, పార్టీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో మధురపూడి విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.



ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్న నెహ్రూను గజమాలలతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. అక్కడ నుంచి భారీ కాన్వాయ్‌తో మురారి, కృష్ణవరం, సోమవరం, జగ్గంపేట మీదుగా స్వగ్రామం ఇర్రిపాకకు ఆయన చేరుకున్నారు. జిల్లాలో 20 రోజులుగా నెలకొన్న పరిస్థితులపై పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు నెహ్రూకు వివరించారు. గోదావరి జిల్లాలను ఎడారిగా చేసే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలువరించాలని, జిల్లాలోని పలు ఇసుక రీచ్‌లను నిలువునా దోచుకుంటున్న తెలుగు తమ్ముళ్ల తీరుపై ఉద్యమం చేపట్టాలని నేతలు విజ్ఞప్తి చేశారు.



ఎత్తిపోతల పథకం భూమి పూజకు వస్తున్న ముఖ్యమంత్రిని అడ్డుకోవాలని, ఇందుకోసం రైతులతో కలిసి పార్టీ శ్రేణులు భారీగా సిద్ధం కావాలని బోస్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు సూచించారు. దీనిపై నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. పోలవరాన్ని నిర్వీర్యం చేస్తూ, గోదావరి రైతులను అధోగతి పాలుజేసే ఎత్తిపోతల  పథకానికి తనమీద నుంచి నడుచుకుంటూ వెళ్లి శంకుస్థాపన చేయాలని, దీనిని అడ్డుకునేందుకు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా నెహ్రూ అన్నారు.



ఆయన చేసిన ఈ ప్రకటన పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. గోదావరి జిల్లాల్లో పార్టీ కేడర్‌ను ఉద్యమం దిశగా సిద్ధం చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం నెహ్రూకు సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతలు నిలుపుచేయాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ ఈ నెల 14న హోమం ద్వారా ఉద్యమ పథంలో తొలి అడుగు వేయాలని నిర్ణయించారు. అనంతరం జిల్లా నుంచి పట్టిసీమ వరకూ పాదయాత్ర కూడా చేయాలని, తద్వారా రైతులకు ఎత్తిపోతలువల్ల కలిగే నష్టాన్ని తెలియజేయాలని నేతలు సంకల్పించారు. దీంతోపాటు సామాన్యులకు జిల్లాలో ఇసుక అందకుండా చేస్తున్న టీడీపీ నేతల తీరుపై కూడా పోరు సాగించేందుకు తాను ముందుంటానని నెహ్రూ ప్రకటించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top