దోపిడీ దొంగల బీభత్సం

దోపిడీ దొంగల బీభత్సం


ఏలూరు (వన్‌టౌన్) : జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దారికాచి లారీని అడ్డగించారు. డ్రైవర్‌ను రాడ్లతో చితకబాది.. కత్తులతో పొడిచి రూ.25 వేల నగదు, బంగారు ఉంగరాన్ని అపహరించుకుపోయూరు. ఏలూరు శివారున జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన నగరంలో సంచలనం రేకెత్తిం చింది. రామచంద్ర ఇంజినీరింగ్ కాలే జీ వద్ద జరిగిన ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆత్మరక్షణ కోసం లారీ డ్రైవర్ దుండగుల్లోని ఒకరి నుంచి కత్తిని లాక్కుని ఎదురు దాడికి దిగగా, వారిలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఏలూరు త్రీ టౌన్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన సుదీప్ చెప్మా అనే లారీ డ్రైవర్ కోల్‌కతా నుంచి చెన్నైకు ఏలూరు మీదుగా దోమ తెరల లోడుతో వెళుతున్నాడు.

 

 జాతీయ రహదారిపై రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఐదుగురు దోపిడీ దొంగలు రెండు మోటార్ సైకిళ్లను అడ్డుగా పెట్టి లారీని నిలుపుదల చేశారు. లారీ ఆగిన వెంటనే ఇద్దరు దొంగలు మెరుపు వేగంతో క్యాబిన్‌లోకి ప్రవేశించి డ్రైవర్ సుదీప్ చెప్మాపై దాడిచేసి కత్తితో గాయపరిచారు. అతని వద్ద గల రూ.25 వేల నగదు, చేతికి ఉన్న ఉంగరం దోచుకుపోయా రు. మిగిలిన ముగ్గురు దొంగలు లారీ ముందు నిలబడి ఉన్నారు. దాడి సమయంలో డ్రైవర్ సుదీప్ చెప్మా ఆత్మరక్షణ కోసం దుండగుల చేతి లోని కత్తిని లాక్కుని వారిలో ఒకరిపై ఎదురుదాడికి దిగగా, ఆ వ్యక్తి కూడా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తితోపాటు మిగిలిన నలుగురు దొంగలు మోటార్ సైకిళ్లపై అక్కడినుంచి ఉడారుుంచారు. గాయాల పాలైన డ్రైవర్ సుదీప్‌ను 108 వాహనంలో ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆశ్రం ఆసుపత్రికి తీసుకెళ్లారు. దోపిడీ దొంగల్ని పట్టుకునేందుకు  బృందాలను రంగంలోకి దింపామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

 

 నగరంలో భయం.. భయం

 ఇటీవల వరుస హత్యలు, దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న నగర ప్రజ లను దారి దోపీడీ ఘటన భయాందోళనలకు గురిచేసింది. కలపర్రు టోల్‌గేట్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంత జరిగినా అక్కడే ఉండే హైవే పెట్రోలింగ్ సిబ్బందికి తెలియకపోవటం వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై ఈ ఘాతుకం జరగటంతో వాహన చోదకులు, ప్రయూణికులు, రహదారి పక్కనే ఉన్న నాలు గు కాలేజీల విద్యార్థులు  బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఘటనతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు‘గాయపడిన వ్యక్తి సమాచారం ఇవ్వండి’.

 

 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల వద్ద దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరు.. లారీ డ్రైవర్ జరిపిన ఎదురు దాడిలో గాయపడ్డాడని, అతడు చికిత్స కోసం జిల్లాలోని ఏ ఆసుపత్రికి వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని త్రీ టౌన్ సీఐ పి.శ్రీనివాసరావు కోరారు. ఆత్మరక్షణ కోసం లారీ డ్రైవర్ జరిపిన ఎదురు దాడిలో దొంగల్లో ఒకరి మొహంపై గాయూలయ్యూయని ఆయన పేర్కొన్నారు. దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఆ వ్యక్తి సమాచారం ఎంతో కీలకమన్నారు. గాయంతో ఆ వ్యక్తి ఏలూరు లేదా పరిసర గ్రామాలు, ఇతర ప్రాంతాల్లోని ఏదో ఒక ఆసుపత్రిలో కచ్చితంగా చేరి ఉంటాడని పేర్కొన్నారు. దోపిడీ దొంగకు చికిత్స నిర్వహించిన వైద్యులు అతడి సమాచారాన్ని ఏలూరు డీఎస్పీ సెల్ నంబర్ 94407 96603 లేదా తన సెల్ నంబర్ 94409 04808కు తెలియజేసి సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top