మెగా ఫ్యామిలిలో పుట్టడమే అదృష్టం

మెగా ఫ్యామిలిలో పుట్టడమే అదృష్టం


 శ్రీకాకుళం కల్చరల్: పిల్లా నువ్వులేని జీవితం చిత్ర యూనిట్ శనివారం శ్రీకాకుళంలో సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న ఎస్‌వీసీ రామలక్ష్మణ థియేటర్ మ్యాట్నీషో సయయంలో హిరో  సాయి ధరమ్ తేజ్, కథానాయిక తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి హీరో తేజ్,  హీరోయిన్ రేజీనా మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అభిమానాన్ని కొనసాగించాలన్నారు. సినీనటి హేమ మాట్లాడుతూ సినిమాకి మంచి హిట్ ఇచ్చినందుకు ధన్యవాదాలన్నారు.


తొలుత థియేటర్ యూజమాన్యం చిత్ర యూనిట్‌కు పూలదండలతో, బొకేలతో స్వాగతం పలికారు. చిత్ర నిర్మాతలు బన్నీవాసు, శ్రీహర్ష, ఎస్‌వీసీ థియేటర్స్ ప్రతినిధి విజయభాస్కర్, హాలు మేనేజర్ బోసుబాబు, ఫ్యాన్సు అసోసియేషన్ సభ్యులు చౌదరి సతీష్, త్వైకాండో శ్రీను, వైశ్యరాజు మోహన్, జీవీ నరసింహం, జామి దిలీప్, గిరి, సత్యనారాయణ ఉన్నారు.

 

 శ్రీకాకుళం కల్చరల్:మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలిలో పుట్టడమే తన అదృష్టం.. అవకాశం వస్తే చిరు 150వ చిత్రంలో నటిస్తానని చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల మేనల్లుడు.. పిల్లా నువ్వులేని జీవితం కథా నాయకుడు సాయిధరమ్ తేజ్ చెప్పారు. చిత్రం విజయోత్సవంలో భాగంగా శనివారం శ్రీకాకుళం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

 

 ప్రశ్న: హీరో అవ్వాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది?

 జవాబు: డిగ్రీ పూర్తయిన తరువాత మాస్టర్ డిగ్రీ చేయాలనుకుంటుండగా నటించాలనే చిన్న ఆలోచన వచ్చింది. డాక్టర్ కావాలనుకున్నా... అది నాకు సెట్ కాలేదు. తర్వాత లాయర్ కావాలనుకున్నా అదీ కరెక్ట్ అనిపించలేదు. ఇలా అనుకుంటుండగానే ఎంబీఏ పూర్తిచేశాను. అప్పుడే నటుడుని కావాలనే ఆలోచన వచ్చింది.  

 

 ప్రశ్న: చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల హీరో అయిపోవడం ఈజీ అనుకుని ఈ ఫీల్డ్‌లోకి వచ్చారా?


 జవాబు: నేను నటించాలనుకున్నాను కాని హీరో అవుదామనుకోలేదు. నటుడిగా స్థిరపడ్డాక హీరోగా చేద్దామనుకున్నా. ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు మాత్రం హీరోగా అనుకోలేదు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఈజీ అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. అరుుతే మెగా ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం.  

 

 ప్రశ్న: నటుడు అవుదామని ముందుగా మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గర చెప్పారు?

 జవాబు: తొలుత కల్యాణ్ మావయ్యతో చెప్పాను. ఎందుకంటే నాకు చిన్నప్పటినుంచి ఆయనతో చనువు ఎక్కువ. చెప్పగానే అన్నయ్యకు చెప్పావా అన్నారు. లేదంటే.. వెళ్లి అన్నయ్యతో చెప్పు అన్నారు. చిరంజీవి గారికి చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను.

 

 ప్రశ్న: మీ కెరీర్‌లో పవన్ కల్యాణ్ సాయం ఏమైన ఉంటుందా?


 జవాబు: ఆయన ఒక గైడ్, ఒక గురువు. ఉపాధ్యాయుడు తన స్టూడెంట్‌ని ఎలాగైతే గైడ్ చేస్తారో అలాగే ఆయన నన్ను గైడ్ చేశారు. అవకాశం వస్తే చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది.  

 

 ప్రశ్న: విజయ యాత్రకు సిక్కోలు నుంచి శ్రీకారం చుట్టడానికి కారణం?

 జవాబు: పిల్లా నువ్వులేని జీవితం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా మా చిత్ర యూనిట్ విజయయాత్ర ప్రారంభించాల ని నిర్ణరుుంచారు. వెంటనే నేను శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని ఆలయం నుంచి ప్రారంభించాలని మా నిర్మాతలను కోరాను. దానికి అంగీకారం రావడంతో ఇక్కడ నుంచే విజయయూత్ర ప్రారంభించా.

 

 ఆదిత్యుని సన్నిధిలో..

 పిల్లా నువ్వులేని జీవితం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యదేవుని ఆలయం చాలా బాగుందన్నారు. అర్చకుడు ఇప్పిలిశంకరశర్మ ఆశీర్వచనం అందజేశారు.

 

 కూర్మనాథుని సన్నిధిలో..

 గార:శ్రీకూర్మం శ్రీకూర్మనాథుడ్ని సినీ హీరో సాయి ధరమ్ తేజ్  దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top