2 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు


ఏఎన్‌యూ (గుంటూరు), న్యూస్‌లైన్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2014-15 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్‌యూ పీజీ సెట్ (పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలు మే రెండో తేదీ నుంచి జరుగనున్నాయి. ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం పీజీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ జి.రోశయ్య విడుదల చేశారు.





ప్రవేశ పరీక్షలు గుంటూరులోని ఏసీ కళాశాల, ఏఎన్‌యూ పీజీ సెంటర్ (ఒంగోలు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (కేదారేశ్వరపేట, విజయవాడ)ల్లో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4:30 గంటల వరకు జరుగుతాయి. 2న ఉదయం ఇంగ్లిష్, మధ్యాహ్నం తెలుగు, సోషియాలజీ అండ్ సోషల్‌వర్క్ సబ్జెక్టులకు, 3న ఉదయం ఎంఈడీ కోర్సుకు, మధ్యాహ్నం ఎమ్మెస్సీ  మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఆయిల్ అండ్ ఫ్యాట్స్ కోర్సులకు, 4న ఉదయం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ బోటనీ, ఎంకాం కోర్సులకు, మధ్యాహ్నం ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్, ఎమ్మెస్సీ మాథమాటిక్స్, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ (క్యూఆర్ అండ్ ఓఆర్), ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కోర్సులకు, 5న ఎంఏ జర్నలిజం, ఎమ్మెసీ జియాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ నానో బయోటెక్నాలజీ, ఎంపీఈడీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.



ఈ నెల 21వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పంపిణీ చేస్తారు. ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రీషనల్ సెన్సైస్, ఎమ్మెసీ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీ , ఎంఏ హిస్టరీ, ఎంఏ ఏన్సియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఎంఏ మహాయాన బుద్దిస్ట్ స్టడీస్, ఎంఏ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్, ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్, ఎంఏ సంస్కృతం, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ అంబేద్కర్ స్టడీస్ కోర్సులకు కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top