మళ్లీ పెట్రో వాత.
నెలలో మూడోసార్లు పెంపు
మొన్న రాష్ర్టం వాట..ఈసారి కేంద్రం అదే బాట
జిల్లా వాసులపై రూ.1650కోట్ల భారం
విశాఖఫట్నం: తగ్గించినట్టే తగ్గించి ఆనక మెళ్లగా వాత పెట్టడంపాలకులకు అలవాటైంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత వరుసగా తగ్గుతూ వచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు కేవలం నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు పెంచే శాయి. మళ్లీ పాత పద్దతిలోనే వాతలుపెడుతున్నారంటూ సామాన్యులు గగ్గోలు పెడు తున్నారు.
ఈ నెల మొదటివారంలో లీటరు పెట్రోల్ ధర రూ.60.46లు, డీజిల్ ధర రూ.49.27లకు తగ్గింది. దీంతో వాతలు తగ్గినట్టేనని అన్ని వర్గాల ప్రజలు ఎంతగానో ఊపిరి పీల్చుకున్నారు.
పాత ధర కొత్త ధర
65.39 69.67
53.95 58.10