పెంచేశారు


పెట్రోల్ ధర లీటరుకు రూ.3.78 పెంపు

     డీజిల్‌పై రూ.3.09 వడ్డింపు

     జిల్లా ప్రజలపై నెలకు రూ.8.85 కోట్ల భారం

 

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :‘పెరుగుట విరుగుటకే’ అన్న సామెతను ‘తగ్గుట పెరుగుటకే’ అన్నట్టుగా తిరగరాస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం శనివారం అమాంతం పెంచేసింది. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలపై నెలకు రూ.8.85 కోట్ల మేర భారం పడనుంది. పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.3.78, డీజిల్ ధరను లీటరుకు రూ.3.09 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. జిల్లాలో పెట్రోల్‌ను రోజుకు 5 లక్షల లీటర్ల వరకు వినియోగిస్తున్నట్టు అంచనా. దీని ధర పెరగటంతో జిల్లాలోని వినియోగదారులపై రోజుకు రూ.16 లక్షలు, నెలకు రూ.4.80 కోట్ల మేర భారం పడనుంది. జిల్లాలో ద్విచక్ర

 ఎం.కల్యాణ్‌దుర్గ : హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాం.

 

 వాహనాలు సుమారు 5 లక్షల వరకు ఉన్నాయి. వీరంతా పెట్రోల్‌నే వినియోగిస్తున్నారు. వీటితోపాటు కొన్ని కార్లు సైతం పెట్రోల్‌పైనే ఆధారపడుతున్నాయి. ట్రక్ ఆటోలు 12 వేల 415, 20 వేల కార్లు, భారీ స్థాయిలో లారీలు ఉన్నాయి. వీటికి 4.50 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన డీజిల్ వినియోగించేవారిపై రోజుకు రూ.13.50 లక్షలు, నెలకు రూ.4.05 కోట్ల మేర భారం పడుతోంది. ఈ లెక్కన పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై నెలకు రూ.8.85 కోట్ల మేర భారం పడుతుందని అంచనా. జిల్లాలో హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకులు 44, బీపీసీ బంకులు 47, ఐఓసీ బంకులు 101, ఇతర కంపెనీలకు చెందినవి 16 వరకు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌ధరల పెంపు రవాణా, వ్యాపార, వాణిజ్య రంగాలతోపై ప్రత్యక్షంగా భారం పడనుండగా, వాటిని ఆధారంగా చేసుకునే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్ల ధరలు కూడా పెరిగి ప్రజలపై పరోక్షంగా భారం పడుతుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top