పనితీరే కొలమానం

పనితీరే కొలమానం


మాఫియా ఆగడాలను అరికట్టండి

బదిలీల్లో మంత్రుల  జోక్యం ఉండదు

సమావేశంలో మంత్రి దేవినేని

మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై అసహనం


 

విజయవాడ : ఉద్యోగులంతా రాజీపడకుండా పారదర్శకంగా పనిచేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. ఉద్యోగుల బదిలీలకు పనితీరే కొలమానమని, ఉద్యోగుల బదిలీ వ్యవహరంలో మంత్రుల జోక్యం ఉండదని సృష్టం చేశారు. బుధవారం స్థానిక నీటి          పారుదల శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర  సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాలపై మంత్రులు సమావేశంలో చర్చించారు.   శాఖల వారీగా అధికారులు ఆయా శాఖల గురించి సమావేశంలో వివరించగా మంత్రి దేవినేని పలు శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం, అసహనం వక్తం చేశారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ ఉద్యోగులు అవినీతికి దూరంగా పూర్తి పారదర్శకతతో పనిచేయాలని హితవు                       పలికారు. రాష్ట్ర రాజధాని ఇక్కడే నిర్మితం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులు, ఇతర కార్యక్రమాల వివరాలపై అధికారులు పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.  ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలపై, ఇతర అభివృద్ధి పనులపై తప్పనిసరిగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు అధికారులంతా అవినీతికి దూరంగా పనిచేయాలని ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో అందిన 5.40 లక్షల దరఖాస్తులు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీనికోసం అధికారులంతా పూర్తిస్థాయిలో తమకు సహకరించాలని కోరారు.



విద్యుత్ శాఖపై మాట్లాడుతూ సబ్-స్టేషన్ల నిర్మాణం,  వీటీ  పీఎస్ కొత్త విద్యుత్ లైన్‌కు అవసరమైన  భూసేకరణ, ఇతర కార్యక్రమాలను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌పై మాట్లాడుతూ  970 పంచాయతీలకుగానూ 400 మంది అధికారులు మాత్రమే ఉన్నారని, జిల్లా కలెక్టర్‌తో సంప్రదించి పారదర్శకంగా వీఆర్వోల బదిలీలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడుతూ జిల్లాలో 178 మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు గానూ 44 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ఖాళీలున్న 534 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మాట్లాడుతూ గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో 9 స్థానం వచ్చిందని, వచ్చే సంవత్సరం మెదటి మూడు స్థానాల్లో ఉండడానికి  విశేషంగా కృషిచేయాలని సూచించారు  జిల్లా పౌరసరఫరాలశాఖ,మార్కెటింగ్‌శాఖపై మాట్లాడారు. రైతులకు సుబాబుల బకాయిలు ఎగ్గొట్టిన వారిపై పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  మైనింగ్ శాఖ  అసిస్టెంట్ డెరైక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.  నగర పాలక సంస్థ, వీజీటీఎం ఉడా,  ఇతర విభాగాలపై సమీక్ష నిర్వహించారు.



మంత్రి కొల్లు రవీంద్ర,  జిల్లా పరిషత్ చైర్    పర్సన్ గద్దె అనూరాధ,  విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడారు.  కలెక్టర్  రఘు          నందన్‌రావు మాట్లాడుతూ ఈపాస్ విధానంతో ఆధార్‌ను అనుసంధానం చేసి ప్రభుత్వ పథ          కాలను ప్రజలకందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జేసీ మురళీ, విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు , ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి,  ఎస్పీ విజయ్‌కుమార్, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లాముఖ్య ప్రణాళికాధికారి శర్మ, ఇరిగేషన చీఫ్ ఇంజినీర్ సుధాకర్, డ్వామా పీడీ మధులత, డీఎంహెచ్‌వో నాగ    మల్లేశ్వరి, డీపీవో నాగరాజు వర్మ, వివిధ    విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top