కలవరపెడుతున్న నకిలీనోట్లు

కలవరపెడుతున్న నకిలీనోట్లు - Sakshi


- రూ.1000, 500 నోట్లల్లోనే ఎక్కువ

- ఏటీఎంలలోనూ వస్తున్నాయంటున్న కస్టమర్లు

- ఎక్కువ మొత్తంలో నష్టపోతున్న వైన్‌షాపులు, దాబాలు

సాక్షి, విజయవాడ బ్యూరో :
నకిలీ కరెన్సీ నోట్లు జనాన్ని కలవరపెడుతున్నాయి. ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వైన్‌షాపులు, రోడ్లపక్క దాబాలు, బిర్యానీ సెంటర్లు, పెట్రోలు బంకుల యజమానులు వీటి బారిన పడి ఇబ్బం దులకు గురవుతున్నారు. విజయవాడ, గుంటూ రు, రాజధాని గ్రామాల్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అరికట్టాల్సిన పోలీసు యంత్రాం గం మీనమేషాలు లెక్కిస్తోంది.  రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు కొత్తకొత్త వ్యాపారాలూ మొదలవుతున్నాయి. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా బడా వ్యాపారులు వస్తున్నాయి.



కోట్లల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని జనం చేతుల్లో డబ్బు పెద్ద మొత్తంలో మెదులుతోంది. ఇదే అదనుగా తీసుకుని దొంగనోట్లు మార్చే అరాచకశక్తులు రంగప్రవేశం చేస్తున్నాయి. స్థానికంగా ఉండే నోట్ల మార్పిడి ముఠాలతో చేతులు కలిపి అసలు నోట్లలో కొద్దికొద్దిగా నకిలీ కరెన్సీ కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు పెద్ద మొత్తం లో నష్టపోతున్నారు. రూ1000, 500 కరెన్సీ నోట్లల్లో ఎక్కువగా నకిలీవి వస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు.

 

మెషీన్లు లేకపోవడంతో...

వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, రోడ్ల ప క్కనుండే దాబాలు, బిర్యానీ సెంటర్లు, పెట్రోలు బంకుల్లో చాలాచోట్ల నకిలీనోట్లు గుర్తించే మిష న్లు(డిటెక్టర్లు) లేవు. రాత్రిపూట వైన్‌షాపుల్లో  నకిలీ నోట్లను గుర్తించడం కష్టం. దీంతో ఎక్కువ నోట్లు ఇక్కడే మారుతున్నట్లు తెలుస్తోం ది. మరుసటి రోజు నగదుతో బ్యాంకుల కెళితే అక్కడ బయట పడుతున్న నకిలీనోట్లను చూసి సిబ్బంది ఠారెత్తిపోతున్నారు. అంతేకాకుండా ఏటీఎంలలో కూడా నకిలీనోట్లు వస్తున్నాయని కస్టమర్లు చెబుతున్నారు. అయితే దీన్ని బ్మాంకు అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఫోర్ ప్లస్ వన్ మెషీన్లతో 5 స్లాట్స్‌లో కౌంటింగ్, నకిలీ కరెన్సీ గుర్తించే మిషన్స్ అందుబాటులో ఉన్నందున బ్యాంకుల్లో గుర్తించడం తేలికంటున్నారు.  అయితే ఏటీఎంలలో వచ్చే నకిలీ నోట్లు  ఎక్కడ కలుస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు.

 

పోలీసులేం చేస్తున్నట్లు?

నకిలీ కరెన్సీని మార్చే వ్యక్తులపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టడంలేదన్న విమర్శలు వినవ స్తున్నాయి.  విజయవాడ, గుంటూరుల్లో సిబ్బం ది కొరతతోపాటు మంత్రుల పర్యటనల కార ణంగా నకిలీ కరెన్సీపై ప్రత్యేక దృష్టిపెట్టలేకపో తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top