పట్టిసీమలో పచ్చి మోసం


డెల్టాను ఎడారిగా మార్చే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలన్న తలంపుతో సర్కారు ‘నయా’వంచనకు తెరతీసింది. రైతులకు పరిహారం చెల్లించకుండానే వారి భూముల్ని లాక్కునేందుకు మాయోపాయాలను ప్రయోగిస్తోంది. ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి రూ.19.53 లక్షలు, పంట నష్టానికి రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు. పనులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవని, పనులు చేపట్టేందుకు అంగీకరించకపోతే ఎకరానికి రూ.9 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇస్తారంటూ బెదిరిస్తున్నారు. భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసే ముఠాల తరహాలో అధికారులు వ్యవహరిస్తూ అన్నదాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.కోరుతున్నారు.

 

 ఇది ప్రభుత్వ నిర్ణయమని.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే నష్టపోయేది రైతులేనంటూ భయపెడుతున్నారు. సర్కారు తీరుతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొత్తం 300మంది రైతుల నుంచి 170 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. ఆ 170 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీకి  భూముల్ని అప్పగించాల్సి ఉంది. అయితే, రైతులకు సర్కారు ప్రకటించిన మేరకు పరిహా రం చెల్లించకుండా భూముల్ని స్వాధీ నం చేయాలని అధికారులు వారిపై ఒత్తిడి చేస్తున్నారు.

 

  రైతులు వెంటనే భూములు ఇస్తారని భావించి ఎకరానికి రూ.19.53 లక్షలు, పంట నష్టపోయినందుకు రూ.20 వేల చొప్పున పరిహా రం ఇచ్చేం దుకు అంగీకరించామని.. వెంటనే భూములు ఇవ్వకపోతే ఎకరానికి రూ.9 లక్షలు మాత్రమే ఇస్తారని హడలగొడుతున్నారు. ఏదో విధంగా రైతులను విడగొట్టి పనులు చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భూములకు సంబంధించిన రైతుల నుంచి ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. పంట నష్టానికి సంబంధించి ఒప్పంద పత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ కార్యాలయానికి రావాలని రైతులకు ఫోన్లు చేస్తున్నారు.

 

 పరిహారం చెల్లించకుండా భూముల్లోకి వస్తే సహించం

 అధికారుల బెదిరింపులు, ఒత్తిడి నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి భూములిచ్చిన రైతులు శనివారం పోలవరంలోని నూతనగూడెంలో సమావేశమయ్యారు. సర్కారు తీరుపై నిరసన తెలిపారు. పంట నష్టం, భూమికి సంబంధించిన పరి హారం చెల్లించేంతవరకూ తమ భూ ముల్లో పనులు చేపట్టేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ కె.భాస్కర్ చెప్పిన ప్రకారం ఎకరానికి రూ.19.53 లక్షలు, పంటనష్టం రూ.20 వేల చొప్పున చెల్లించిన తరువాతే పనులు చేపట్టేందుకు అంగీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల తహసిల్దార్ ఎం.ముక్కంటి వచ్చి పనులు చేసుకోవడానికి సహకరించాలని కోరారని, నష్టపరిహారం ఇవ్వడానికి మరో 50 రోజుల సమయం పడుతుందని అన్నారని రైతులు తెలిపారు.

 

 ఈలోగా భూముల్లో పనులు చేపట్టేం దుకు సహకరించాలని కోరారన్నారు. రైతులు వెంటనే భూములు ఇస్తారని భావించి ఎకరానికి రూ.19.53 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారని, లేదంటే ఎకరానికి రూ.9 లక్షల వరకు మాత్రమే ధర పెడతారని తహసిల్దార్ చెప్పారని రైతులు తెలి పారు. ఏదోవిధంగా రైతులను విడగొట్టి పనులు చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పంట నష్టానికి సంబంధించి కూడా ఒప్పంద పత్రాలు తీసుకునేందుకు రావాలని ఫోన్ చేసి చెబుతున్నారని రైతులు వివరించారు. ఈ అధికారులు బదిలీపై వెళ్లిపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.

 

 పరిహారమిచ్చాకే భూములిస్తాం

 నాకున్న ఎకరం భూమి పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో పోతోంది. 79 సెంట్లకు మాత్రమే పంట నష్టం చెల్లిస్తామంటున్నారు. వెంటనే రెవెన్యూ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టమంటున్నారు. మిగిలిన భూమికి పంటనష్టం అడిగితే రెండవ దఫాలో ఇస్తామంటున్నారు. భూముల్లో పనులు చేసుకోనివ్వాలని రెవెన్యూ ఒత్తిడి తెస్తున్నారు. పంట నష్టం, భూ నష్టం ఇచ్చేంతవరకు పనులు చేయవద్దని చెప్పాం

 - సిగ్ధన అరవాల రాజు, పోలవరం

 

 రైతులపై ఒత్తిడి చేయడం తగదు

 నా పొలంలో రెండెకరాల భూమి ఎత్తిపోతల పథకంలో పోతోంది. పంట నష్టం, భూమి పరిహారం చెల్లించేంత వరకు నా భూముల్లో పనులు చేస్తే ఊరుకోను. వెంటనే భూములు ఇస్తారన్న ఉద్దేశంతోనే ఎకరానికి రూ.19.53 లక్షల ధర నిర్ణయించామంటు న్నారు. భూములు తరువాత ఇస్తామంటే ఎకరానికి రూ.9 లక్షలే ఇస్తారని తహసిల్దార్ చెప్పారు. రైతులపై ఈ విధంగా ఒత్తిడి తేవడం న్యాయం కాదు. నష్టపరిహారం చెల్లించాకే పనులు చేయాలి.

 - బండి మురళీకృష్ణ, పోలవరం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top