నిరాశ పడొద్దు

నిరాశ పడొద్దు


అనంతపురం రూరల్: రుణమాఫీ అందని వారు నిరాశ చెందాల్సిన పనిలేదు. వారి వివరాలను సేకరించండి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా అర్హులందరికీ న్యాయం చేసేలా చూస్తామని మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆరు మండలాలకు సంబంధించి విస్తృత స్థాయి  సమావేశం నిర్వహించారు.  మంత్రి మాట్లాడుతూ రుణమాఫీ పొందిన వారిలో తక్కువ రుణం మాఫీ అయినవారు వినతిపత్రం ఇవ్వాలన్నారు.  జాయింట్ కలెక్టర్, బ్యాంకర్లతో రుణమాఫీపై మాట్లాడతామన్నారు.



గ్రామాల్లో అందరినీ కలుపుకుని ముందుకుపోవాలన్నారు. అభివృద్ధి పనుల్లో సమతుల్యంగా పార్టీ శ్రేణులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. మంత్రి అయ్యాయన్న భావన వీడి ఓ అక్కగా సమస్యలు చెప్పుకోవాలన్నారు.  తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటినందించేలా చర్యలు చేపడుతామన్నారు. రాప్తాడులో అతిథి గృహం కోసం రూ కోటి, బండమీద పల్లి, హంపాపురంలో హాస్టళ్లలో కోసం రూ 92 లక్షలు, రామగిరిలో కళాశాల కోసం రూ కోటి 40 లక్షలు, సీకే పల్లిలో ఆస్పత్రి నిర్మాణం కోసం రూ 3కోట్ల 95 లక్షలు మంజూరయ్యాయన్నారు.



గ్రామాల్లో మట్టి రోడ్ల స్థాంనలో తారు రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు.   జెడ్పీఛైర్మన్ చమన్ మాట్లాడుతూ గ్రూపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా అభివృద్ధికి సహకరించాలన్నారు.  సీనియర్ కార్యకర్తలకు సీసీ రోడ్ల నిర్మాణం, లైట్ల ఏర్పాటు, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో పనులను అప్పగించాలన్నారు. కొన్ని పంచాయితీలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని, ఎంపీపీతో గట్టిగా అడిగి పనిచేయించుకోవాలన్నారు.   సమావేశంలో రాప్తాడు మండలం స్పెషలాఫీసర్ నారాయణస్వామి, అనంతపురం ఎంపీపీ కన్నేగంటి మాధవి, జెడ్పీటీసీ వేణు, టీడీపీ మండల కన్వీనర్ పామురాయి వెంకటేశ్  తదితరులు పాల్గొన్నారు.

 

 ప్రజలకు సంక్రాంతి కానుక

రూ.226 విలువైన నిత్యావసర సరుకులు ఉచితం

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత

 

అనంతపురం సెంట్రల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు చంద్రన్న కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ. 226 విలువైన ఆరు రకాల వస్తువులను నూరుశాతం సబ్సిడీతో ఉచితంగా అందజేయాలని నిర్ణయించినట్లు వివరించారు.



రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల కార్డుల వినియోగదారులకు అదనంగా రూ. 287 కోట్లు భరిస్తున్నట్లు తెలిపారు. 6503 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 6503 మెట్రిక్ టన్నుల పామాయిల్, 6503 మెట్రిక్ టన్నుల బెల్లం, 1307 మెట్రిక్ టన్నుల  శనగలు, 1307 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1301 కిలో లీటర్ల నెయ్యి అందివ్వాలని నిర్ణయించామని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top