మగవాళ్ల రెక్కీలు.. మగువల చోరీలు


  •    ‘పాలక్కడ్’ దొంగల ముఠాల స్టయిలే వేరు..

  •   పనుల కోసమని వచ్చి అద్దె ఇళ్లలో నివాసం

  •   లక్ష్యం పూర్తవగానే మాయం

  • విజయవాడ సిటీ : రద్దీ ప్రదేశాల్లో దొంగతనాలు చేసే ముఠాల గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. కేరళలోని పాలక్కడ్ జిల్లా పోలాచి తాలూకాలోని సుందర్‌నగర్‌కు చెం దిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, పెద్ద మొ త్తంలో సొమ్ము స్వాధీనం చేసుకుకున్నారు. విచారణ సందర్భంగా వీరి నుంచి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాల క్కడ్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు దొంగతనాలు వృత్తిగా జీవనం సాగిస్తుంటాయి. ఈ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నెలల తరబడి నివా సం ఉంటాయి. వారు లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం సమకూరగానే స్వస్థలాలకు వెళ్లిపోతా రు. అక్కడ ఖరీదైన ఇళ్లను కట్టించుకుని, భూ ములు కొని, దర్జాగా జీవితం గడుపుతుం టారు. పిల్లలకు ఉన్నత విద్య చెప్పిస్తుంటారు.

     

    తొలుత రెక్కీ

     

    సాధారణంగా రెండుమూడు కుటుంబాలు కలిసి నగరాలు, పట్టణాలకు వలస వస్తాయి. అక్కడ మగవాళ్లు ఏదో ఒక పనిలో చేరతారు. ఈ నెపంతో ఇళ్లను అద్దెకు తీసుకుంటారు. ఆ తర్వాత రద్దీగా ఉండే దేవాలయాలు, కళ్యాణ మండపాలను పరిశీలిస్తారు. తరువాత వాటిని ఆడవాళ్లను తీసుకెళ్లి చూపిస్తారు. ఇతరులకు అనుమానం రాకుండా ఖరీదైన దుస్తుల్లో అం దంగా ముస్తాబు కావడం ఈ మహిళల ప్రత్యేకత. ఇద్దరు మహిళలు చోరీ చేసేందుకు లోనికి వెళతారు. దూరంగా ఒకరిద్దరు మహిళలు గమనిస్తూ ఉంటారు. నగలను దొంగిలించగానే బ యటకు వచ్చి అక్కడ వేచి ఉన్న వారికి వాటిని అందజేస్తారు. తిరిగి నిమిషాల వ్యవధిలో మరో నేరం చేసేందుకు ఉపక్రమిస్తారు. వారి లక్ష్యం నెరవేరగానే స్వస్థలాలకు వెళ్లిపోతారు.

     

    సీసీ కెమెరాలు లేకుంటేనే..

     

    నేరం చేసేందుకు ఎంచుకున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నదీ, లేనిదీ గుర్తించడం ఈ ముఠాల్లోని మగవాళ్ల ప్రత్యేకత. సీసీ కెమెరాలు లేవని నిర్ధారించుకున్నాకే చోరీలు చేస్తారు.

     

    నోరు విప్పరు..

     

    అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా పట్టుబడితే మిగిలిన వారి గురించి ఎట్టి పరిస్థితుల్లోను వెల్లడించరు. తాము మాత్రమే నేరం చేసినట్టు పేర్కొంటారు. పోలీసులు ఎంతగా హిం సించినా మిగిలిన వారి పేర్లు చెప్పకపోవడం ఈ ముఠాల్లోని మహిళల ప్రత్యేకత.

     

    చోరీ చేసిన నగలు ఇవ్వరు..

     

    చోరీల కేసుల్లో నిందితుల వివరాలు పోలీ సులకు లభ్యమై వారిని పట్టుకునేందుకు వారి స్వస్థలాలకు   వెళ్లినపుడు అక్కడి గ్రామ పెద్దలతో నిందితులు పంచాయితీలు పెట్టిస్తుం టా రు. సాధారణంగా వీరిపై నమోదైన కేసులకు సంబంధించి అరెస్టు చేసేందుకు పెద్దలు అం గీకరిస్తారు. వారితో బేరసారాలు సాగించి దొం గిలించిన నగల విలువను నగదు రూపంలో ఇప్పిస్తుంటారు. చోరీ చేసిన నగలను మాత్రం నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. మహిళలను మాత్రం వదిలేయాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేస్తారు. వీలుకాని పక్షంలో వారిని అదుపులోకి తీసుకున్నా కొట్టకుండా ఉండేలా ఒప్పందం చేసుకుంటారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top