బాక్సైట్‌ కోసమే అవుట్‌ పోస్టులు

బాక్సైట్‌ కోసమే అవుట్‌ పోస్టులు - Sakshi


 త్వరలో అన్ని సంఘాలతో కలిసి ఆందోళన

 గిరిజన సమాఖ్య నేత
లు




కొయ్యూరు(పాడేరు): మావోయిస్టులను అడ్డుకునేందుకే మన్యంలో అవుట్‌పోస్టుల ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికా రులు  చెబుతున్నా,  దాని వెనక బాక్సైట్‌ను తరలించుపోయే పన్నగం ఉందని  ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు గోకిరి చిన్నారావు,మండల పీసా కమిటీ కోశాధికారి స్వామి నాయుడు ఆరోపించారు. మావోయిస్టులు తగ్గిపోయారని పోలీసులే  చెబు తున్నారని, అదే పోలీసులు మావో యిస్టులను అడ్డుకునేందుకు అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. వారు శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.



చింతపల్లి డీఎస్పీ అనీల్‌ మాట్లాడుతూ రాళ్లగెడ్డలో ఇది వరకు ఏర్పాటు చేసిన అవుట్‌పోస్టు,త్వరలో  ఏర్పాటు చేయనున్న తూరుమామిడి అవుట్‌పోస్టులు మావోయిస్టులు,గంజాయి స్మగ్లర్లను అడ్డుకోవడం కోసమే నని కోసం తెలిపారన్నారు.ఎవరైనా అవుట్‌పోస్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని గంజాయి స్మగ్లర్లు, మావోయిస్టులకు సహకరిస్తున్నట్టుగా చిత్రీకరిస్తూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బాక్సైట్‌ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా  నిలిపివేసింది తప్ప పూర్తిగా కాదన్నారు. బాక్సైట్‌ తవ్వేందుకు రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయలేదని తెలిపారు.ఈ జీవో రద్దు కాకపోవడంతో గిరిజనుల్లో నేటికీ  బాక్సైట్‌ భయం ఉందన్నారు. త్వరలో అన్ని సంఘాలను కలుపుకొని  అవుట్‌ పోస్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని తెలిపారు.  



ఖనిజాల తరలింపు కోసమే...

పాడేరు రూరల్‌ :  ఏజెన్సీలో ఏ కట్టడమైన, తవ్వకాలైన పీసా కమిటీలు, గ్రామ పంచాయతీల   అనుమతితోనే చేయాలని,  కానీ అందుకు విరుద్ధంగా పోలీసులు ఔట్‌పోస్టులు నిర్మించడం చట్టాన్ని ఉల్లఘించడమేనని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  పోలీసు ఔట్‌పోస్టుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. గతంలో కూడా ఏజెన్సీలో ఔట్‌పోస్టులు ఉండేవని, కానీ అభివృద్ధి›మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని తెలిపారు.  బాక్సైట్, లేట్‌రైట్, గ్రానైట్, రోడ్‌మెటల్‌  తరలించుకుపోయే గ్రీన్‌హంట్‌ మాఫీయాను కాపాడడానికే ఈ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.  గిరిజన ప్రాంతంలో సమస్యల గురించి ప్రశ్నిస్తే మావోయిస్టుల సానుభూతిపరులుగా, గంజా యి స్మగ్లర్లుగా చిత్రీకరించడం తగదని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top