మా ఇంటి వద్దే


ధర్మవరం అర్బన్ : తన ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయూలని టీడీపీ నేత ఒకరు పట్టబట్టడం.. అందుకు వృద్ధులు ససేమిరా అనడంతో దిక్కుతోచని తపాలా శాఖ ఉద్యోగులు కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోరుున వైనమిది. ధర్మవరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని 37వ వార్డులో బుధవారం పింఛన్లు పంపిణీ చేయడానికి తపాలా శాఖ ఉద్యోగులు స్థానిక మున్సిపల్ పార్కు వద్దకు చేరుకున్నారు. ఆ సమయూనికి పెద్ద సంఖ్యలో వృద్ధులు వచ్చారు. అంతలో టీడీపీ ఆ వార్డు ఇన్‌చార్జ్ బెస్త శివ అక్కడకు చేరుకుని, పింఛన్ల పంపిణీ తన ఇంటి వద్ద జరగాలని అధికారులకు హుకుం జారీ చేశారు.

 

  ఇందుకు వృద్ధులు ఒప్పుకోలేదు. మళ్లీ అంత దూరం నడవ లేమని, పైగా మాకు ఓటెయ్యలేదంటూ వే ధిస్తారని వృద్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు కూడా వృద్ధులను సమర్థించారు. మున్సిపల్ కమిషనర్ కూడా పార్క్‌లోనే పింఛన్లు పంపిణీ చేయూలని చెప్పారు. అంతలో టీడీపీ నేత ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండంటూ మున్సిపల్ చైర్మన్ బీరే గోపాల్ నుంచి అధికారులకు ఫోన్ వచ్చింది. స్థానిక కౌన్సిలర్ చందమూరు నారాయణరెడ్డి జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. ‘మా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వాలని నేను చెబుతున్నా.. ఇదే విషయూన్ని మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పారు.. అరుునా మీకు అర్థం కాలేదా.. ఇంకెవరితో చెప్పించాల’ని సదరు టీడీపీ నేత తపాలా ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విషయూన్ని ఉన్నతాధికారులకు వివరించి.. ఇలాగైతే తమ వల్ల కాదని తపాలా శాఖ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయూరు. ఇదిలా ఉండగా పింఛన్ల పంపిణీకి కౌన్సిలర్ నారాయణరెడ్డి అడ్డుపడుతున్నారంటూ సదరు టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేయరాదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా, టీడీపీ నేతలు ఇలా బరితె గిస్తున్నారేంటని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top