ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత

ఉద్యోగులకు ఆప్షన్ ఫారాలు అందజేత


5వ తేదీలోగా సమర్పణకు అవకాశం



హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ఆయా శాఖలు, విభాగాలు ఆప్షన్ ఫారాలను అందజేశాయి. ఈ నెల 5వ తేదీలోగా ఆప్షన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇటు సచివాలయంతో పాటు జంటనగరాల్లోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగులు ఏ రాష్ట్రానికి ఆప్షన్ పెట్టుకోవాలనే దానిపై చర్చల్లోనే మునిగిపోయారు. భార్య కూడా ఉద్యోగి అయితే ఏ రాష్ట్రంలో ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుందనే సమాచారాన్ని సహచర ఉద్యోగులతో చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద 5వ తేదీ వరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులు ఆప్షన్ ఫారాలను నింపడం, సమర్పించడంపైనే దృష్టిసారించనున్నారు. ఈ అంశంపై ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top