ఓపెన్ వర్సిటీ డిగ్రీ అర్హత పరీక్ష గడువు పెంపు
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును మార్చి 14వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎ.సుధాకర్ శనివారం తెలిపారు. పరీక్ష ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుందన్నారు.