ఆన్‌లైన్‌లో గ్రంథాలయ సేవలు


నర్సీపట్నం టౌన్ :  గ్రంథాలయాలు ఆధునికీకరణను సంతరించుకున్నాయి. పోటీ పరీక్షల కాలంలో బ్యాంకు ఉద్యోగాలు, డీఎస్సీలకు సిద్ధమవుతున్న యువతకు ఎంతో సమాచారాన్ని అందిస్తూ బాసటగా నిలుస్తున్నాయి. జిల్లా కేంద్రం తరువాత నర్సీపట్నం గ్రంథాలయాన్ని అన్ని హంగులతో పాటు అన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే పట్టణ వాసులకు మరింత సమాచారం పొందగలుగుతారు.



పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులో ఉన్న గ్రంథాలయాల సమగ్ర సమాచారం, అందులోని పుస్తకాల వివరాలను అన్‌లైన్‌లో పొందుపర్చి వాటిని ఏ గ్రంథాలయం నుంచైనా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. నిత్యం  వేల మందికి పైగా పాఠకులు పుస్తకాలు, పత్రికలు కోసం గ్రంథాలయాలకు వస్తున్నారు. చాలా గ్రంథాలయాల్లో కావలసిన పుస్తకాలు, పోటీ పరీక్షల మ్యాగజైన్లు అందుబాటులో ఉండటం లేదు. వాటిని అడిగితే ఆ గ్రంథాలయాధికారులు పై అధికారులకు తెలియజేశాం.. వస్తున్నాయంటూ దాటవేస్తున్నారు.



ఇప్పుడు అలా ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేదు. కావలసిన పుస్తకాలు, గ్రంథాల గురించి నేరుగా వెబ్‌సైట్ ద్వారా కంప్యూటర్‌లో రాష్ట్ర గ్రంథాలయ డెరైక్టరేట్‌కు తెలియజేసే వీలుంది. పబ్లిక్ లైబ్రరీ, ఎపీ ఎన్‌ఐసీ ఇన్ వెబ్‌సైట్‌ను టైపు చేయాలి. అప్పుడు గ్రంథాలయ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. దీనికి ఎడమవైపు అన్‌లైన్‌బుక్ రిక్వెస్ట్ ఫారంపై క్లిక్ చేస్తే సంబంధించిన ఫారం వస్తుంది. అక్కడ రాష్ర్టంలోని మండలాల వారీగా గ్రంథాయాలు సహా అన్ని వివరాలు కనిపిస్తాయి.

 

మనం డిమాండ్ చేస్తున్న గ్రంథాలయం, కావలసిన పుస్తకం, రచయిత పేరు, మీ పేరు, చిరునామా పూర్తి చేసి సెండ్ చేసి పంపాలి. ఆ విజ్ఞప్తి మేరకు సమాచారం డెరైక్టరేట్‌కు చేరుతుంది. అక్కడ ఏడు నుంచి 15 రోజులకోసారి దీనిపై సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడి గ్రంథాలయాల్లో ఏ పుస్తకాలు ఉండాలని పాఠకులు కోరుకుంటున్నారో వాటి కొనుగోలుకు అనుమతులు ఇస్తారు.

 

నిరుద్యోగ యువతకు కావలసిన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చుకునే అవకాశం ఉంది. దీనిలో భాగంగా జిల్లాలోని పాడేరు, చింతపల్లి, అరుకు ప్రాంతాల్లో రూ.25 లక్షల చొప్పున గ్రంథాలయాలను ఆధునీకరిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top