అక్టోబర్ 5న జీశాట్-18 ప్రయోగం

అక్టోబర్ 5న జీశాట్-18 ప్రయోగం


శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అక్టోబర్ 5వ తేదీన  జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. వేకువ జామున 2 నుంచి 3.15 గంటల మధ్య ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-వీ231 రాకెట్ ద్వారా 3,404 కిలోల బరువు కలిగిన ఈ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. జూన్ 8న ఈ ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా మరో రెండు దేశాలకు చెందిన ఉపగ్రహాలు ప్రాన్స్‌కు చేరడం ఆలస్యం కావడంతో వాయిదా పడింది.



ఈ ఉపగ్రహంలో 24 సీ బాండ్ ట్రాన్స్‌పాండర్స్, 12 ఎక్స్‌టెండెడ్ సీ బాండ్ ట్రాన్స్‌పాండర్స్, 12 కేయూ బాండ్ ట్రాన్స్‌పాండర్స్, రెండు కేయూ బీకాన్ బాండ్ ట్రాన్స్‌పాండర్స్‌ను పంపిస్తున్నారు. 15 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందిస్తుంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రయోగించబోయే పీఎస్‌ఎల్‌వీ సీ36లో మొత్తం 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంలో 670 కిలోల బరువు కలిగిన రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహంతో దేశ, విదేశీ యూనివర్సిటీలకు చెందిన 82 బుల్లి ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top