టిప్పర్ కింద పడి వృద్ధురాలి మృతి


విజయనగరం: టిప్పర్ కింద పడి ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. విజయనగరం జిల్లా గుంజరాజ గ్రామ సమీపంలో కురుపాం నుంచి మొండికల్ వైపు వెళ్తున్న టిప్పర్ కింద పడి తోయిక స్వామమ్మ(60) అనే వృద్ధురాలు మరణించింది.


ఆమె స్వగ్రామం గుమ్మలక్ష్మీపురం మండలం తిళ్లుగూడగా పోలీసులు గుర్తించారు. నీలకంఠాపురం ఎస్‌ఐ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top