మా పొట్ట కొట్టొద్దు

మా పొట్ట కొట్టొద్దు


హిరమండలం: వంశధార నిర్వాసితులు మరోమారు అధికారులకు ఎదురెళ్లారు. కడుపు నింపుతున్న పొలాలను తవ్వే పనులు చేయవద్దని హెచ్చరించారు. చేసిన త్యాగాలను మర్చిపోయి కడుపు కొట్టే చర్యలు తీసుకోవద్దని వేడుకున్నారు. నాయకుల పొలాలు వదిలేసి పేదల పంటలను ధ్వంసం చేయడం తగదని సూటిగా చురకలంటించారు. తులగాం రెవెన్యూ పరిధిలో వంశధార రిజర్వాయర్‌ గట్టు నిర్మాణానికి మట్టి సేకరించేందుకు అధికారులు రెండు రోజులుగా పంట పొలాలను నాశనం చేస్తున్నారు. ఇందులో భాగంగా తులగాం గ్రామ సమీపంలో నాట్లు వేసిన పంట పొలాలను మంగళవారం యం త్రాలతో ధ్వంసం చేశారు.



 విషయం తెలుసుకున్న తులగాం నిర్వాసితులు ఒక్కసారిగా పొలాల వద్దకు వచ్చి తామంతా పేదలమని, పొట్టకూటి కోసం రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నామన్నారు. పోలీసులు, వంశధార అధికారులు తమ భూముల్లో ఉన్న వరి నాట్లను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. తమ పక్కనే ఉన్న నాయకుల భూముల్లో నాట్లు ఉన్నా వాటిని ఎందుకు పాడు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. అన్ని భూముల నుంచి క్రమేపీ మట్టిని సేకరిస్తామని అధికారులు నచ్చజెప్పుతూ పక్కనే ఉన్న పలువురి నాయకుల భూముల్లో వరినాట్లు నాశనం చేసి మట్టి తవ్వారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, తహసీల్దార్లకు తెలియజేశారు.



నిర్వాసితులతో అధికారుల చర్చలు

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహసీల్దార్‌ కాళీప్రసాద్‌ ఈఈ సీతారాం నాయుడు, సీఐ ప్రకాష్‌లు నిర్వాసిత గ్రామాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పంట ఉన్న పొలా లను విడిచి పెట్టాలని నాట్లు వేయని ఖాళీగా ఉన్న పొలా ల్లో మట్టి సేకరణ చేసుకోవచ్చునని నిర్వాసితులు తెలి పారు. అలాగే తులగాంకు చెందిన నాయకుడు మాట్లాడుతూ తులగాం రెవెన్యూ పరిధిలో సుమారు 900 ఎకరాల విస్తీర్ణం ఉందని ఇందులో సుమారు 750 ఎకరాలు విస్తీర్ణంలో గట్టు నిర్మాణానికి  మట్టి సేకరించారని మిగి లిన గ్రామాల్లో ఒక్క ఎకరా విస్తీర్ణంలో మట్టి సేకరించలేదని ఆ గ్రామాలకు వెళ్లి మట్టి సేకరించుకోవాలని తెలిపారు.



 దీంతో ఈఈ మాట్లాడుతూ ప్రస్తుతానికి అన్ని గ్రామాల్లో కూడా మట్టి సేకరణ చేస్తామని తెలిపారు. అయితే పంట భూముల్లో మట్టి సేకరిస్తే ఊరుకొనేది లేదని ఖాళీ ప్రదేశాల్లో సేకరించుకోవాలని నిర్వాసితులు తెలపడంతో... నాట్లు వేయవద్దని సూచించినా వేశారని ఖాళీ పొలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని వంశధార అధికారులు అడిగారు. దీనికి నిర్వాసితులు ఆగ్రహం చెంది సమస్యలు పరిష్కరించాకే పనులు చేయాలని తేల్చి చెప్పారు. దీంతో ఆర్డీవో సమస్యలు తెలపాలంటూ నిర్వాసిత నాయకులను అడిగి తెలుసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న భూముల నుంచి మట్టి సేకరించేందుకు తులగాం పరిసరాలకు చేరుకున్నారు.



అక్కడ పనులు జరిగేందుకు మరిన్ని యంత్రాలు తే వాలని అందరి భూములను చదును చేయాలని కాం ట్రాక్టర్లను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న తులగాం నిర్వాసితులు మరికొందరు మళ్లీ అధికారులను అ డ్డుకున్నారు. ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసి తమ డి మాండ్లను ఏకరువు పెట్టారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం కావడంతో అధికారులు పనులను ఆపి యంత్రాలను తరలించారు. దీంతో నిర్వాసితులు వెనుదిరిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top