సినీ పరిశ్రమను త్వరగా తరలించడం సాధ్యం కాదు: సురేశ్ బాబు
హైదరాబాద్: సినీ పరిశ్రమను త్వరగా తరలించడం సాధ్యం కాదని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు స్పష్టం చేశారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై సినీ రంగ ప్రముఖులతో మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్వహించిన సమావేశానికి సురేశ్ బాబుతోపాటు పలువురు హాజరయ్యారు.
అనంతరం సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించమని కోరింది అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, లోకేషన్ పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని దగ్గుబాటి సురేష్‌బాబు తెలిపారు.